Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జూన్ 21న ఏర్పడే సూర్యగ్రహణం గురించి ఆసక్తికర విషయాలు | Solar Eclipse 2020

గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ గ్రహణాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగ్రహణం రెండుసార్లు రాగా... మరికొద్ది రోజుల్లో అతి పెద్ద సూర్య గ్రహణం ఏర్పడనుంది.... జూన్ 21న ఏర్పడనున్న సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం… ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని కీలక మార్పులు సంభవించవచ్చు అని చెప్తున్నారు పండితులు.. గతేడాది అంటే 2019 డిసెంబర్ 26 న వచ్చిన చివరి సూర్యగ్రహణం సమయం నుండి ప్రపంచంలో కరోనా వైరస్ ప్రారంభం అయింది కాబట్టి, ప్రస్తుతం ఏర్పడనున్న ఈ గ్రహణంతో కరోనా బెడద ముగస్తుందని జ్యోతిష్కులు ఆశిస్తున్నారు.

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం జూన్ 21న ఆదివారం ఉదయం ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా.. వలయాకారంలో కనువిందు చేయనుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో ‘జ్వాలా వలయం’ ఏర్పడుతుంది. జూన్ 21న ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. అయితే, మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చి.. చంద్రుడి నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజులలోనే జరుగుతుంది. అయితే, అన్ని అమావాస్యలలోనూ గ్రహణాలు ఏర్పడవు.

ఈ సూర్యగ్రహణాన్నిప్రపంచ వ్యాప్తంగా అందరూ వీక్షించవచ్చు. అయితే భారత్ లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడవచ్చు. ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చి సూర్యుడు పూర్తిగా కనిపించకపోతే సంపూర్ణ సూర్యగ్రహణంగా, కొంతమేరకే కనిపించకపోతే పాక్షిక సూర్యగ్రహణంగా చెబుతారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.

సూర్యగ్రహణం జూన్ 21న 10.31 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుంది. పూర్తి ప్రబావం ...… దాదాపు 3 గంటల 33 నిమిషాలకు పూర్తి గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం యొక్క సూతక కాలం 12 గంటల ముందే ప్రారంభం అవుతుంది.. అంటే జూన్ 20 9 గంటల 25 నిమిషాలకు ప్రారంభమై గ్రహణంతో సూతక కాలం సమాప్తం అవుతుంది.

ఈ సూర్యగ్రహణం కారణంగా గ్రహాలు, నక్షత్రరాశులలో మార్పులు సంభవించనున్నాయి అని అంటున్నారు జ్యోతిష్కులు.. ఈ గ్రహణంతో కరోనా మహమ్మారి ముగింపు పలకనుందని చెప్తున్నారు… ఈసారి సూర్యగ్రహణం ఆదివారం రావడంతో…. వర్షం తగ్గుతుందని… ఫలితంగా గోధుమలు, వరి, ఇతర ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందని, అదే సమయంలో ఆవు పాలు ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్తున్నారు… ఇంతే కాక ప్రధాన దేశాలు, దేశాధినేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చని అంటున్నారు.. అయితే ఈ గ్రహణం వల్ల వ్యాపారులకు మంచి జరుగుతుందని చెప్తున్నారు..

ప్రజలు సాధారణంగానే గ్రహణం సమయంలో వివిధ రకాల నమ్మకాలు, ఆచారాలు పాటిస్తుంటారు.. . ముఖ్యంగా గ్రహణం సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, భోజనం కూడా చేయకూడదు అని నమ్ముతారు. . గ్రహణం సమయంలో విగ్రహాలను తాకకూడదు. అందుకే దేవాలయాలు సైతం మూసివేసి గ్రహణ అనంతరం సంప్రోక్షణ గావిస్తుంటారు.. అందరు గ్రహణం అనంతరం తప్పక స్నానం ఆచరించి సూర్యదేవుని ధ్యానం చేయడం ద్వారా ఈ గ్రహణం ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెప్తున్నారు పండితులు..

Famous Books:



జూన్ 21 సూర్యగ్రహణం, సూర్యగ్రహణం 2020, సూర్యగ్రహణం, surya grahan 2020, Surya Grahan, urya grahan, surya grahan ballia, surya grahana kannada 2020, surya grahan live status, surya grahan dikhao, how to look surya grahan, surya grahan in jharkhand, about tomorrow surya grahan, surya grahan patna/

Comments