Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ నెల 21వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత | Tirumala Temple Close on 21st june | Hindu Temples Guide

ఈ నెల 21వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత :

కరొన వైరస్ నేపధ్యం లో అని ఆలయలు గత 77 రోజుల పాటు మూసి జూన్ 8న తిరిగి పునః దర్శనాలు ప్రారంభించారు అనే సమాచారం అందరికీ తెలిసిందే. కానీ ఈ నెల 21వ తేదీన మారియొక్క సారి స్వామి యొక్క శ్రీ వారి ఆలయం మూసివేసి ఉంటుంది. అందుకు ఈనెల 21వ తేదీన సూర్య గ్రహణం కారణంగా  వేకువజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 

ప్రతి రోజు ఆన్ లైన్ లో 3 వేల మందికి, ఆఫ్ లైన్ అనగా నేరుగా కౌంటర్ల ద్వారా మరో 3 వేల మందికి కలిపి మొత్తం 6 వేల టికెట్లు జారీ చేసి దర్శనానికి అనుమతిస్తున్నామని, మరియు 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన భక్తులను కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు దర్శనానికి అనుమతించడం లేదన్నారు. దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

పరిమిత సంఖ్య లోనే అనుమతి :

అలిపిరి వద్ద దర్శన టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నాకే తిరుమలకు రావాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల ద్వారా దర్శనానికి రావాలనుకుంటే రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని కాబట్టి ఆన్ లైన్లో బుక్ అయితేనే దూర ప్రాంతాల నుండి తిరుపతికి వస్తే మంచిదని సూచించారు. ఒకరి పేరు మీద టికెట్ తీసుకుని మరొకరు దర్శనానికి వస్తే అనుమతిచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ 6 నుండి 7 అడుగుల సామాజిక దూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకుని దర్శనం చేసుకుంటున్నారని దర్శనాల సంఖ్య పెంచాలని సూచనలు అందుతున్నాయని దీనిపై పూర్తి స్థాయిలో పరిశిలన జరిపిన అనంతరం దర్శన టోకెన్ల సంఖ్యని పెంచుతామన్నారు.

ఆన్ లైన్ లో టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులు వెంటనే వసతి సౌకర్యాన్ని కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలని ఈవో సూచించారు. స్వామి వారి దర్శనం ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకొని రావాలి అని సూచించారు. స్వామి వారి పుష్కరణి మరియు అనుబంధ ఆలయాలు కూడా మూసివేత. స్వామి వారి హుండీ వద్ద కూడా హెర్బల్ శానిటైషాన్ తప్పనిసరి. ఇతర ఆలయల సమాచారం 

కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి :

ఇదే జిల్లా లోని మారియొక్క ప్రసిద్ది చెందిన ఆలయం కాణిపాకం లోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం లో కూడా పరిమిత సంఖ్య లోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కానీ అంతరాలయ దర్శనం లేదు. ఒక గంటకి కేవలం దాదాపుగా 300 మంది భక్తులకి మాత్రమే స్వామి దర్శనం. మరియు 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. స్వామి వారి దర్శనం ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. సూర్య గ్రహణం కారణంగా ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు అనుమతి కల్పించాన్నారు. 

శ్రీశైల మల్లికార్జున స్వామి : 

ఆంధ్రప్రదేశ్ లోని మారియొక్క ప్రసిద్ది చెందిన  ఆలయం శ్రీశైల మాలికార్జున స్వామి ఆలయం. కరొన వైరస్ నేపద్యంలో ఈ ఆలయంలో కూడా స్వామి వారి దర్శనానికి పరిమిత సంఖ్య లోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కానీ అంతరాలయ దర్శనం లేదు. పాతాళగంగ లో పుణ్య స్నానాలకి అనుమతి లేదు. శ్రీశైల మల్లన స్వామి దర్శన కోసం తప్పనిసరిగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు.ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చే భక్తులు ఆ రాష్ట్రాల ప్రభుత్వ ఈ - పాస్ తప్పనిసరి చేశారు. స్వామి వారి ఒక గంటకి కేవలం దాదాపుగా 300 మంది భక్తులకి మాత్రమే స్వామి దర్శనం. మరియు 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. స్వామి వారి దర్శనం ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. సూర్య గ్రహణం కారణంగా ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు అనుమతి కల్పించాన్నారు. 

శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం , విజయవాడ :

ఆంధ్రప్రదేశ్ లోని మారియొక్క ప్రసిద్ది చెందిన ఆలయం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయంలో కూడా పరిమిత సంఖ్య లోనే అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అమ్మవారి దర్శనం ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒక గంటకి కేవలం దాదాపుగా 250 మంది భక్తులకి మాత్రమే స్వామి దర్శనం. మరియు 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. సూర్య గ్రహణం కారణంగా ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు అనుమతి కల్పించాన్నారు. 

Comments