Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఏపీలో డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలు రద్దు | AP Degree Exams Cancel

"డిగ్రీ, పీజీ, బీటెక్‌, వృత్తి విద్య, అన్ని కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని పలువురు వెల్లడించారు. ఉపకులపతుల డిగ్రీ, పీజీ, బీటెక్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు!", 

డిగ్రీ, పీజీ, బీటెక్ , వృత్తి విద్య, అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని పలువురు వెల్లడించారు. ఉపకులపతుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను సీఎం జగన్ కు వివరించి, అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు. డిగ్రీ మొదటి, రెండు, బీటెక్ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు పంపిస్తారు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ పై వర్సిటీల వీసీలతో మంగళవారం మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ నాయక్ , ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పరీక్షలను రద్దు చేస్తే కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన సెమిస్టర్ , మిడ్, ఇతర అంతర్గత మార్కులు, సబ్జెక్టుల వారీగా మౌఖిక పరీక్షలు(వైవా), ఏదైనా చిన్న పరీక్ష నిర్వహించడం ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు.

చివరి సెమిస్టర్ విద్యార్థులకు గత సంవత్సరాల్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఉంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు కేటాయిస్తారు.

అకడమిక్ సంవత్సరం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తారు.

వర్సిటీలు కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాయి. మిగతా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు కేటాయిస్తారు.

Famous Books:





ap degree exam cancel, AP UG and PG Exam News, AP Diploma, Degree, PG Exams , AP SSC Exams 2020 and Inter Supply Exams Cancelled, డిగ్రీ, పీజీ, బీటెక్‌ పరీక్షలు రద్దు

Comments