తిరుపతిలో శనివారం దర్శనాలు రద్దు :
తూర్పు గోదావరి జిల్లా, పెద్ధాపురం మండలం, తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానము, తొలి తిరుపతినకు శనివారం భక్తులు రద్దీ అధికముగా ఉండే అవకాశం ఉన్నందున, అట్టి సందర్భం ఏర్పడితే భక్తులకు ఇబ్బంది అవుతుందని, ప్రజారోగ్య, గ్రామ సంక్షేమ దృష్ట్యా, ఉన్నతాధికారుల మరియు గ్రామస్థుల సూచనల మేరకు ది.13.6.2020 న దర్శనాలు రద్దు చేయడమైనది. ఇప్పటికే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ది.13.6.2020 న దర్శనాలు రద్దు చేసినారు. కావున భక్తులు ది13.6.2020 న దర్శనాలకు రావద్దని మనవి చేయడమైనది.🙏
ఆలయ ఇ.ఓ.
కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్.
Comments
Post a Comment