ఏపీ బీటెక్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త :
కరోనా కాలంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు పలు ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.ఏపీ ప్రభుత్వం బీటెక్ ,డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత మూడు నెలలుగా విద్యార్థులు కాళీగానే ఉంటున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ,బీటెక్ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆన్లైన్ కోర్సుల్లో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను అందించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోర్సులను అందించడానికై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఎండీ శ్రీకాంత్ తెలిపారు.
మరోవైపు శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిలోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకువచ్చాయన్నారు. మరిన్ని వివరాలకోసం https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపారు.
Famous Temples:
డిగ్రీ బీటెక్ , Degree Exams, Degree And BTech Students, Andhra Pradesh, online Classes, exams ap,

Comments
Post a Comment