Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రెండు రాళ్లు దొరికాయి రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు | Miner Becomes Millionaire after Finding

రెండు రాళ్లు దొరికాయి  రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు:
టాంజానియాలో గనులు తవ్వే ఓ చిన్నపాటి మైనర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. తన జీవితంలోనే కాదు, తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది.

అదృష్టం ఏరూపంలో ఏవైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే రంగురాళ్ల కోసం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే వెదుకులాడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే మాదరిగా టాంజానియాలో కూడా అక్కడి ప్రజలు తమ భూముల్లో వజ్రాలు ఉన్నాయని, ఏదో ఒకరోజు తమకు దొరికితే కోటీశ్వరులం అయిపోతామని నమ్ముతుంటారు. ఆ మేరకు వీలుదొరికినప్పుడల్లా తమ పొలాల్లో తవ్వకాలు జరుపుతుంటారు.

ఈ సంఘటన టాంజానియా దేశంలో జరిగింది.ఓ రోజు వారి కూలీ జాక్ పాట్ కొట్టేశాడు.

అసలు అతను జాక్ పాట్ ఎలా కొట్టాడో అనుకుంటున్నారా…? చూడడానికి మామూలుగా రాళ్లలాగే ఉంటాయి కానీ, అవి అత్యంత విలువైన జాతి రత్నాలు కు సంబంధించిన రాళ్లు.దీనితో అతని తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది.
52 ఏళ్లు ఉన్న లైజర్ కు అదృష్టం వచ్చింది.కేవలం రెండే రెండు రాళ్లు అతని జీవితం మొత్తాన్ని మార్చేశాయి.

మామూలుగా తూర్పు ఆఫ్రికా వజ్రాల గనుల కు పేరు మోసింది.అక్కడి ప్రజలకు వారి వారి భూములలో దొరికే వజ్రాలను డైరెక్టుగా ప్రభుత్వానికి అమ్మి వారు సొమ్ము చేసుకోవచ్చు.

నిజానికి చాలా మంది ఇదే పనిలో జీవనం కొనసాగిస్తుంటారు.లైజర్ తన ప్రాంతంలో ఉండే ఓ గనిలో రోజు కూలీగా పని చేసేవాడు.

ఆ వజ్రాలు కూడా ఎంత భారీ సైజులో ఉన్నాయంటే ఒక ఒక రాయి బరువు 9.72 కిలోలు ఉండగా మరొకటి 5.1 కిలోలు ఉన్నాయి.అయితే ఇది ముదురు వైలెట్ నీలి రంగులో ఉన్నాయి.ఇక వాటిని ప్రభుత్వానికి విక్రయించడంతో అతనికి దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌ లభించాయి.దీని విలువ భారత కరెన్సీలో 25 కోట్లగా ఉంటుంది. ఈ రెండు రాళ్లలో ఒకటి ఊదా రంగులో ఉండగా.. మరొకటి నీలం రంగులో ఉన్నది. ఈ రెండు రాళ్లను మ్యూజియంలో ఉంచాలని టాంజానియా అధ్యక్షుడు సూచించారు.
టాంజానియా గనుల మంత్రిత్వశాఖ అతడికి ఈ సొమ్ము అందించటంతో రాత్రికి రాత్రి అతడు కుబేరుడయ్యాడు. దీనిపై అతడి స్పందన ఎలా ఉంది?

‘‘పెద్ద పార్టీ ఇస్తాను’’ అని లేజర్ బీబీసీతో చెప్పారు. అతడికి 30 మంది కన్నా ఎక్కువ మందే సంతానం ఉన్నారు.

టాంజానైట్‌కి ఇంత విలువ ఎందుకు?
టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది.

భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు.

ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది.

ఎంత అరుదైన శిల అనేదానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.

లేజర్‌కు గత వారంలో రెండు టాంజానైట్ శిలలు దొరికాయి. ఒక దాని బరువు 9.2 కిలోలు ఉంటే, మరొకటి 5.8 కిలోల బరువు ఉంది. వాటిని బుధవారం నాడు మాన్యారా ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమం సందర్భంగా విక్రయించారు.

దీనికి ముందు వరకూ దొరికిన టాంజానైట్ శిలల్లో అతి పెద్ద శిల బరువు 3.3 కిలోలు మాత్రమే.

దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి స్వయంగా లేజర్‌కు ఫోన్ చేసి అభినందించారు.

‘‘చిన్నతరహా మైనర్లతో కలిగే ప్రయోజనం ఇది. టాంజానియా సంపన్నమైన దేశమని ఇది నిరూపిస్తోంది’’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు.

గనుల తవ్వక రంగంలో టాంజానియా ప్రయోజనాలను పరిరక్షిస్తానని, దానిపై ప్రభుత్వ ఆదాయం పెంపొందిస్తాననే హామీలతో 2015లో అధికారంలోకి వచ్చారు మగుఫులి.

Famous Temples:



రెండు రాళ్లు , Tanzanite , What Is Tanzanite Gemstone, Tanzanite Stone Online at Best Prices 

Comments