Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

చైనా యాప్‌లు వాడుతున్నారా? ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల హెచ్చరిక | Remove China Apps


చైనా యాప్‌లు వాడుతున్నారా?  ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల హెచ్చరిక : 

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లలో కుప్పలుతెప్పలుగా యాప్‌లు ఉంటున్నాయి. అవసరాలు, సరదాల కోసం ఈ యాప్‌లను ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. ఇక చైనాకు చెందిన యాప్‌లను మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అయి తే తాజాగా చైనాతో సంబంధం ఉన్న 52 మొబైల్‌ అప్లికేషన్లపై భారత ఇంటెలీజెన్స్‌ ఏజెన్సీలు హెచ్చరికలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి.

ప్రభుత్వం వీటిని బ్లాక్‌ చేయడమో లేదా వినియోగాన్ని నిలిపివేయాలని ప్రజలను కోరడమో చేయాలని కోరాయి. ఈఅప్లికేషన్లు సురక్షితం కాదని, ఇవి వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలికి సమీకరించుకుపోతున్నాయంటూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన అప్లికేషన్ల జాబితాలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ జూమ్‌, టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, ఎక్సెండర్‌, షేర్‌ఇట్‌, క్లీన్‌మాస్టర్‌ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. కాగా సెక్యూరిటీ ఏజెన్సీల సూచనలకు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌ ఇటీవలే మద్దతు కూడా తెలిపినట్టు ఓ సీనియర్‌ అధికారి పే ర్కొన్నారు. ఇంతకు ముందు జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ-కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (సెర్ట్‌-ఇన్‌) సూచన మేరకు జూమ్‌ యాప్‌ వినియోగానికి సంబంధించిన సలహాలను హోం శాఖ జారీ చేసింది. తైవాన్‌లో ప్రభుత్వ ఏజెన్సీలు జూమ్‌ను వినియోగించకుండా నిషేధించారు. జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ ఆంక్ష లు విధించింది. ఇతర యాప్‌లను వినియోగించాలని యునైటెడ్‌ స్టేట్స్‌ సెనేట్‌ సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

రాడార్‌లోని యాప్‌లివే.. 

టిక్‌టాక్‌, వాల్ట్‌-హైడ్‌, విగో వీడియో, బిగో లైవ్‌, వీబో, వీచాట్‌, షేర్‌ఇట్‌, యూసీ న్యూస్‌, యూసీ బ్రౌజర్‌, బ్యూటీప్లస్‌, ఎక్సెండర్‌, క్లబ్‌ఫ్యాక్టరీ, హలో, లైక్‌, క్వాయ్‌, రోమ్‌వీ, షీన్‌, న్యూస్‌డాగ్‌, ఫొటో వండర్‌, అపస్‌ బ్రౌజర్‌, వివోవీడియో-క్యూయూ వీడియో ఇంక్‌ పర్ఫెక్ట్‌ కార్ప్‌, సీఎం బ్రౌజర్‌, వైరస్‌ క్లీనర్‌ (హై సెక్యూరిటీ లాబ్‌), ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్‌, యూకామ్‌ మేక్‌అప్‌, ఎంఐ స్టోర్‌, 360 సెక్యూరిటీ, డీయూ బ్యాటరీ సేవర్‌, డీయూ బ్రౌజర్‌, డీయూ క్లీనర్‌, డీయూ ప్రైవసీ, క్లీన్‌ మాస్టర్‌ - చీతా కేక్‌ క్లీనర్‌, డీయూ యాప్స్‌ స్టూడియో, బైడూ ట్రాన్స్‌లేట్‌, బైడూ మ్యాప్‌, వండర్‌ కెమెరా, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ లాంచర్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ ప్లేయర్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ మెయిల్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, వీసింక్‌, సెల్ఫీ సిటీ, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, మెయిల్‌ మాస్టర్‌, ఎంఐ వీడియో కాల్‌-షామీ, పారెలల్‌ స్పేస్‌.

Related Posts:
తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? Bijli Mahadev Temple

విచిత్ర వినాయక  దేవాలయము | Sri Mahadevar Athisaya Vinayakar Temple

ఇవ్వడానికి నీ దగ్గర ఏముందో తెలుసుకో | Hindu Temple Guide

> > నయనార్లు శివభక్తులు | Nayanarlu Shivabhaktulu Telugu PDF Book




china apps list india removed, Remove China Apps, china apps list india top chinese apps in india 2020, list of indian apps, list of chinese apps in india 2020, list of chinese apps used in india 2020, how many chinese apps are there in india, indian apps list wikipedia, remove china apps,list of chinese products in india

Comments