Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సూర్యగ్రహణం వల్ల ఈ రాశులవారికి శుభ ఫలితాలు | Surya Grahan Effects On Rashifal 2020


చూడామణి నామక సూర్యగ్రహణం: 
తేదీ : 21-06-2020 ఉదయం 11:58 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది...* *ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును.చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును...మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు."

సూర్యోదయం నుండి గ్రహణం పూర్తి అయ్యే వరకు ఉపాసకులు, మంత్రోపదేశం ఉన్నవారు, జపాలు చేసే వారికి మాత్రమే భోజనాదులు నిషేదం. శక్తి లేనివారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణిలు , ఆనారోగ్యంతో ఉన్నవారికి ఈ నియమం వర్తించదు. శారీరక శక్తి లేనివారికి వర్తించదు. ఆబ్ధికములు గ్రహణం ముగిసిన తర్వతనే చేసుకోవాలని శాస్త్రంలో చెప్పబడినది. గర్భిణి స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఆనారోగ్యంతో ఉన్నవారు, బిపి, షుగర్ మొదలగు పేషంట్లు ఉదయం 8 గంటలలోపు ఏదైనా తెలికైనా ఆహారం తీసుకోవాలి. గ్రహణం పూర్తీ అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి కొత్తగా వంట చేసుకుని తినాలి.

దేవాలయాలు సూర్యోదయ కాలంలో ప్రాతఃకాల పూజలుచేసి మూసివేస్తారు. గ్రహణానంతరం దేవాలయ సంప్రోక్షణ చేసి సూర్యాస్తమానంతరం భక్తులకు దర్శనార్థం తెరుస్తారు. మిథునరాశి, కర్కాటకరాశి వారు, గోచర గ్రహస్థితి అనుకూలంగా లేని రాశుల వారు దోష నివారణ శాంతి చేయించుకోవలెను. ప్రధానంగా మృగశిర, ఆరుద్ర నక్షత్రము వారు. మిగిలిన నక్షత్రముల వారు మీ మీ  రాశుల మొక్క గ్రహణ ప్రభావ ఫలితాల గురించి మీ జ్యోతిష గురువును సంప్రదించి వారికి దక్షిణ తాంభూలాదులు సమర్పించి వివరాలు తెలుసుకుని పాటించగలరు. ఎవరికీ రుణ గ్రస్తులు కాకండి

గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ పెట్టుకునే  తినే ఆహార పదార్ధాల మీద దర్భలు వేసుకోవడం మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం. గ్రహణ ఆరంభంలో స్నానం చేసి మీ యిష్ట దైవాన్ని స్మరిస్తూ గ్రహణ సమయంలో దైవ నామ స్మరణ చేసి, గ్రహణానంతరం ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజా మందిరము శుద్ధి చేసుకోవలెను.

చిత్తశుద్ధితో  ఏ పేరుతో పిలిచినా దైవం అంగీకరిస్తాడు, మంత్రమే  ప్రధానం కాదు అన్న పరమాత్మ సత్యాన్ని గ్రహించండి. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. లేనిపోని మూఢ నమ్మకాలతో , అజ్ఞానంతో  ,అమాయకత్వంతో ఉండకూడదు. దేవుడు అనేవాడు రక్షకుడే కాని శిక్షకుడు కాదు. అందరిలో అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టె దేవుడు అంటున్నాం. మన కర్మ ఫలితాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయి.

* శుభ ఫలితాలను పొందే రాశులు :-  జన్మరాశి నుండి  3, 6,10,11 రాశులు
   మేష (Aries) , మకర ( Capricorn) ,  కన్య ( Virgo), సింహరాశి (Leo)

* మధ్యమ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 2, 5, 7, 9 రాశులు
   వృషభ ( Taurus) , కుంభ ( Aquarius) , ధనుస్సు ( Sagittarius) , తులారాశి ( Libra)</p>

* అశుభ ఫలితాలను పొందే రాశులు :- జన్మరాశి నుండి 1, 4, 8, 12 రాశులు 
   మిధున ( Gemini) , మీన ( Pices), వృశ్చిక ( Scorpio) , కర్కాటక రాశి ( Cancer

తెలంగాణ రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55
గ్రహణ అంత్యకాలం : మ . 1.44
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు

ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23
గ్రహణ మధ్యకాలం : మ .12.05
గ్రహణ అంత్యకాలం : మ . 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి.

Famous Books:





సూర్యగ్రహణం, జూన్ 21న సూర్యగ్రహణం, Solar eclipse effects, surya grahan 2020, Surya Grahan Effects On Rashifal, 

Comments