Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వీటిని గూగుల్ లో సెర్చ్ చేస్తే మీకు నష్టమే | You Should Never Search on Google

వీటిని గూగుల్ లో సెర్చ్ చేస్తే మీకు నష్టమే :
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మనకు అందుబాటులోకి రాకముందు బామ్మలు చెప్పే కథలు, గురువులు చెప్పే పాఠాలు వింటూ జ్ఞానాన్ని సంపాదించేవాళ్లం. ఏ మాత్రం సందేహమొచ్చిన ఒకటికి పదిసార్లు అడిగి తెలుసుకోవటం అప్పటి అలవాటు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. మనకు కావాల్సిన అన్ని విషయలూ అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే సాక్షాత్కారిస్తున్నాయి. ఏదైనా కొత్త విషయం తెలియకపోయినా, సందేహం కలిగిన వెంటనే సెర్చ్ ఇంజన్ గూగుల్ లో వెతకాల్సిందే. కానీ కొన్ని విషయాలను తెలుసుకోవాలనే మీ జిజ్ఞాస మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి..

బాంబ్ తయారీ..
బాణసంచా, పేలుడు పదార్థాల తయారీ గురించి కొందరికి అమితాసక్తి ఉంటుంది. అవి ఎలా పనిచేస్తాయి? వాటిలో వాడే పదార్థాలేంటి.. ఇలా ఇతరత్ర విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ చేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. సెర్చ్ ఇంజన్ గూగుల్ లో కొన్ని పదాలను సెర్చ్  చేస్తే వారిపై సైబర్ డిపార్ట్ మెంట్ ఓ కన్ను వేసి ఉంచుతుంది. ఎందుకంటే బాంబులు, పేలుడు పదార్థాలను ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతుంటారు. కొందరు తెలివిగా సైబర్ పోలీసులకు చిక్కకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని గూగుల్ నుంచి తస్కరిస్తుంటారు. ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలానే బాంబుల తయారీ గురించే తెగ వెతికాడు. చివరికి పోలీసుల వలలో పడ్డాడు. ఇలాంటి ప్రమాదంలో మీరూ పడకండి.

మహిళల ప్రసవం..
ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా మహిళల ప్రసవానికి సంబంధించిన సన్నివేశాలు కనపడుతున్నాయి. కథా పరంగా ఆ సన్నివేశం అనివార్యం కావచ్చు. అయితే అదే సందర్భంలో కొందరు మహిళల ప్రసవానికి సంబంధించిన విషయాలను తెగ గూగుల్ చేస్తున్నారట. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదే. కానీ కొన్ని విషయాలను అతిగా పట్టించుకోకూడదు. అది మీకు మానసికంగా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ప్రసవ సమయంలో మహిళ పడే వేదన మాటల్లో వర్ణించలేం. అంతటి ఇబ్బందికరమైన విషయాన్ని గూగుల్ చేసి మీ మానసిక స్థితిపై ఒత్తిడి పెంచుకోకండి.

మాదక ద్రవ్యాలు..
పెద్దలు హంసలాంటి గుణాన్ని పెంపొందించుకోవాలని పిల్లలకు చెబుతుంటారు. హంస పాలను నీళ్లను వేరు చేస్తుందంటారు. అలానే హంసలాగా చెడును వదిలి మంచిని అలవరుచుకుంటేనే సంఘంలో గౌరవంతోపాటు ఇబ్బందులు లేని జీవితం సొంతమవుతుంది. ప్రస్తుతం యువత పెడదోవ పట్టడానికి ఒక కారణం మాదక ద్రవ్యాలు వాడకం. డ్రగ్స్ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే కొందరు డ్రగ్స్ తయారీ విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ ను ఆశ్రయించి చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి డ్రగ్స్  తయారీ గురించి గూగుల్ లో తెలుసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే అనవసర విషయాలపై సెర్చింగ్ ఒక్కోసారి మీ జీవిత గమ్యాలను కూడా తారుమారు చేస్తుంది.

మరికొన్ని..
పై విషయాలతోపాటు మరికొన్ని పదాలను గూగుల్ లో సెర్చ్ చేయకపోవడమే మంచిది. అవేంటంటే బెడ్ బగ్స్ , బెల్లీ బటన్ బగ్స్, హంట్స్ మ్యాన్ స్పైడర్ , బ్లూ వాఫెల్, క్రొకొడిల్, జిగ్గర్స్ , మౌత్ లార్వా, బాట్ ప్లై రిమూవల్ వంటి వాటిని గూగుల్ లో వెతకకండి. ఎందుకంటే ఇవి చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. ఆసక్తి మంచిదే కానీ కొన్నిసార్లు అమితాసక్తి మంచిదికాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ సందేహమొచ్చిన గూగుల్ చేసే ఈ రోజుల్లో కొన్ని విషయాల సెర్చింగ్ చేయాలంటే మాత్రం కాస్త ఆలోచించండి.
 గూగుల్, Google , Cyber crime, bombs, drugs, digital, don't google search this site, 10 things you must never google, things you should never google image search, what not to search on google in india, 10 disturbing things you should never google, things you can't google

Comments

Popular Posts