ఇది మీకు తెలుసా? ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ:
పొట్ట కూటి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారికి శుభవార్త. సొంతూరులో ఉన్న ఆధార్ కార్డు.. పనిచేసే చోట పనిచేయక ఉద్యోగులు, వలస వెళ్లేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అందులో ఉండే చిరునామా వల్లే సమస్యంతా. ఈ సమస్యకు చెక్ పెట్టింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఆధార్ కార్డులో చిరునామాను ఈజీగా మార్చుకునే వెసులుబాటును కల్పించింది.
Also Read: నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా?
అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు ఇప్పుడు సులభంగానే ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. దీని కోసం మీ వద్ద రెంట్ అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది. అయితే రెంట్ అగ్రిమెంట్‌లో కచ్చితంగా మీ పేరు మాత్రం ఉండాల్సిందే. లేదంటే ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం కుదరదు.
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా రెంటల్ అగ్రిమెంట్‌ను స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈజీగానే మీ ఆధార్ కార్డులో అడ్రస్ మారుతుంది.
దీని కోసం ముందుగా మీరు ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అంటే యూఐడీఏఐ పోర్టల్ ఓపెన్ చేయాలి. తర్వాత అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత రెంట్ అగ్రిమెంట్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఇందులోని వివరాలతో స్టేటస్ తెలుసుకోవచ్చు.
Click here : AADHAAR ADDRESS CHANGE
కాగా ఆధార్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లో ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
aadhaar card address change process, uidai, aadhar card address change documents, aadhar card correction form, aadhar card link with mobile number, aadhar online service, aadhar card mobile number update, aadhar card mein correction, online address change, Aadhaar
Thank U Guriji Gary always given more valueble information
ReplyDelete