Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కరోనా వచ్చినా భయపడక్కర్లేదు | Be Aware, But Don't Panic: How To Deal With Corona-virus Fears


భయపడక్కర్లేదు.. మన దేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది:
కరోనా వైరస్ కొత్త మార్పు చూసి భయపడాల్సిన పనిలేదంటున్నారు. మరో కొత్త జాతిగా కరోనా వైరస్ రూపాంతరం చెందినట్టు తెలిపారు. వైరస్ లో వచ్చిన మార్పులు పెద్దగా ప్రమాదకరమైనవి ఏమి కావని అంటున్నారు. కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా కనిపిస్తున్నాయి. ఒక్కో అధ్యయనం ఒక్కోలా చెబుతుండటంతో సాధారణ ప్రజల్లో గందరగోళానికి దారితీసింది. లేనిపోని భయాలు వ్యక్తమవుతున్నాయి. 

కరోనా పేరు చెబితేనే కొందరు హడలిపోతున్నారు. జ్వరమో, దగ్గో వస్తే చాలు.. బెంబేలెత్తుతున్నారు. ఆ భయంతో గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచిన ఘటనలూ అక్కడక్కడ జరిగాయి. నిజంగా కరోనా అంటే అంత భయపడాలా? ఆ వ్యాధి సోకిందని తెలిస్తే అంతా అయిపోయిందని ఆందోళన చెందాలా? అవసరం లేదనే చెబుతున్నారు.. కొందరు విజేతలు! అలాగని జాగ్రత్తలు పాటించకపోయినా, ఆస్పత్రికి వెళ్లడంలో జాప్యం చేసినా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మనోధైర్యమే మందు'...మనోధైర్యానికి మించిన మందు లేదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు, మంచి ఆహారం తీసుకుంటే తేలిగ్గా బయటపడొచ్చు.
Also Read: వైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు
నా వృత్తి పౌరోహిత్యం. మే నెలలో నా భార్యకు గొంతునొప్పి, జలుబు అనిపిస్తే.. అనుమానంతో కరోనా పరీక్షలు చేయించాం. నాకు, నా భార్యకు, ఒక కుమారుడికి పాజిటివ్ అని తేలింది. మరో కుమారుడికి నెగెటివ్ వచ్చింది. నా వయసు 65 ఏళ్లయినా, ఇతర అనారోగ్యాలు లేకపోవడంతో భయపడలేదు. రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఊపిరితిత్తులు బలపడేందుకు అది చాలా తోడ్పడింది. 14 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నాం. అక్కడ మందులతో పాటు.. రాగి జావ, సోయా గింజలు ఇచ్చారు. ఇంటికి వచ్చిన నాలుగైదు రోజులకు నాకు మళ్లీ జ్వరం వచ్చింది. అనుమానంతో పరీక్షలు చేస్తే.. ఈసారి నెగెటివ్ అనే వచ్చింది. కరోనా సోకినా ఎవరూ భయపడొద్దు. సమయానికి ఆహారం తీసుకోండి. దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగాల కషాయం తీసుకుంటే మంచిది. మేమంతా అదే పాటించాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం.
Also Read: గాలి ద్వారా కరోనా వ్యాప్తి అంగీకరించిన WHO
మేం ఒక పెళ్లికి వెళ్లి వచ్చాక నా భార్యకు దగ్గు, ఆయాసం వచ్చాయి. దాంతో పరీక్షలు చేయించుకున్నాం. ఆమెతో పాటు నాకు, మా వదినకూ పాజిటివ్ అని వచ్చింది. మా వదినకు 58 ఏళ్లు, ఆమెకు మధుమేహం ఉంది. మా భార్యకు తప్ప మా ఇద్దరికీ లక్షణాల్లేవు. 13 రోజులు ఆసుపత్రిలోనే ఉండి, చికిత్స తీసుకున్నాం. తర్వాత నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జి చేశారు. ఆసుపత్రిలో వారు ఇచ్చిన మందులు, ఆహారమే తీసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నాం.

చేపల వేటకు వెళ్తుంటా. నాకు మధుమేహం, బీపీ ఉన్నాయి. స్థానిక ఆర్ ఎంపీ వద్ద మధుమేహ పరీక్ష చేయించుకున్నాను. ఆయన చికిత్స చేసినవారిలో ఎవరికో కరోనా వచ్చిందని తెలిసి.. ఆయన దగ్గరకు వెళ్లిన వారందరికీ పరీక్షలు చేశారు. నాకు, నా భార్యకు పాజిటివ్ అని తెలిసింది. కరోనా గురించి టీవీల్లో చూడటం, వార్తల్లో వినడం తప్ప.. మాకూ వస్తుందని అనుకోలేదు. కొంచెం భయం అనిపించింది. నా వయసు ఎక్కువ కావడంతో విశాఖలోని కొవిడ్ ఆసుపత్రికి పంపించారు. నా భార్యకు అమలాపురంలో చికిత్స చేశారు. ఆసుపత్రిలో అన్నం, చపాతీ, పళ్ల రసాలు, గుడ్డు ఇచ్చేవారు. రోజుకు రెండు మాత్రలు ఇచ్చారు. నాకు జ్వరం, గొంతునొప్పి, ఆయాసం లాంటివేవీ రాలేదు. మేమిద్దరం ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చి 32 రోజులైంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం.

మెడికల్ షాపు నడుపుతుంటాను. రోజూ ఎందరో వచ్చి వెళుతుంటారు. అలా ఎవరి వల్లో నాకు కరోనా సోకింది. నాలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేకపోయినా.. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. నాకేదో అవుతుందని భయపడలేదు. ఆసుపత్రిలో చేరాను. అక్కడ సమయానికి వారిచ్చిన ఆహారం, పారాసిటమాల్ , విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకున్నాను. 14 రోజుల తర్వాత నెగెటివ్ వచ్చింది. డిశ్ఛార్జి చేశారు. ఇప్పుడు యథావిధిగా షాపు తెరుస్తున్నాను.
Also Read: నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
ఆందోళన అవసరం లేదు:
కొవిడ్ రోగులకు చికిత్స చేసిన వైద్యుడిగా, కరోనాను జయించిన వ్యక్తిగా చెబుతున్నాను. మనోధైర్యానికి మించిన రోగనిరోధకశక్తి లేదు. పసుపును మించిన యాంటీ వైరల్ లేదు. కరోనా పాజిటివ్ అని తెలిసినా.. మీకు ఇతర అనారోగ్యాలు, పొగతాగడం వంటి వ్యసనాలు లేకపోతే ఆందోళన చెందక్కర్లేదు. గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి రోజుకి ఐదుసార్లు పుక్కిలించాలి. నేను ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నాను. మా ఆసుపత్రిలోనే వెంటిలేటర్ పై ఉన్న రోగికి చికిత్స చేశా. ఆయనకు కరోనా అని తేలడంతో నాకూ పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చింది. కానీ నాకు లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరి, తేలికపాటి ఆహారం తీసుకునేవాడిని. గుడ్డు, డ్రైఫ్రూట్స్  తీసుకున్నాను. రాత్రి పసుపు, మిరియాలు వేసిన పాలు తాగేవాడిని. సాధారణంగానే ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తాయి. కాబట్టి ఏ చిన్న లక్షణం వచ్చినా కరోనా అని భయపడాల్సిన పనిలేదు. పరీక్ష చేయించుకుని కరోనా అని తేలినా కంగారు లేదు. లక్షణాలను బట్టి చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు...స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు.
Famous Books:


coronavirus recovery time, coronavirus symptoms day by day, what is coronavirus, coronavirus symptoms, coronavirus wikipedia, coronavirus in india, coronavirus map, coronavirus news

Comments