బంగారం ధర పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ పైపైకి చేరుతోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు, బలహీనమైన రూపాయి వంటి అంశాలు పసిడి పరుగుకు దోహదపడుతున్నాయి. బంగారం ధర పెరిగితే వెండి మాత్రం పడిపోయింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పైకి కదిలింది. దీంతో ధర రూ.54,940కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరుగుదలతో రూ.50,370కు ఎగసింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం.
పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2700 పతనమైంది. దీంతో ధర రూ.62,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.40 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1952 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.7 శాతం పెరుగుదలతో 24.50 డాలర్లకు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పైకి కదిలింది. రూ.51,250కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.450 పెరుగుదలతో రూ.52,450కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.1300 పెరుగుదలతో రూ.66,000కు చేరింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
gold today rate, today gold price, gold rate today in india, gold rate today in hyderabad, silver rate today, today gold rate in vijayawada, gold rate today in chennai,gold rate today 22 carat, gold price today in up

Comments
Post a Comment