Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కూరగాయలు, పండ్లతో జాగ్రత్త | How to wash fruit and vegetables


కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఎలా.? ఎప్పుడు.? వ్యాప్తి చెందుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ తరుణంలో మనం రోజూ ఉపయోగించే పండ్లు, కూరగాయల ద్వారా కరోనా సోకుతుందని అనుమానాలు కలిగితే వాటిని ఎలా శుభ్రపరుచుకోవాలి.? ఎలా భద్రపరుచుకోవాలి.? అనే విషయాలపై వైద్యులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


  1. పండ్లు, కూరగాయలను కొనేముందు, కొన్న తర్వాత మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  2. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ప్యాకెట్‌లోనే విడిగా ఉంచాలి.
  3. ఆ తర్వాత మనం కొన్న కూరగాయలు, పండ్లను కొంచెం పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి 20 నిముషాలు ఉంచాలి.
  4. వాటిని శుభ్రమైన తాగునీటితోనే కడగాలి.
  5. తాజా పండ్లు, కూరగాయలపై క్రిమిసంహారక మందులు, లేదా సబ్బు వంటి వాటిని అసలు వాడకూడదు.
  6. వంటకు కావాల్సిన కూరగాయలు, పండ్లను పక్కకు పెట్టి.. మిగిలిన వాటిని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
  7. మాంసం, పండ్లు, కూరగాయలను ఫ్రిడ్జ్ లో వేర్వేరుగా ఉంచాలి.
  8. పండ్లు, కూరగాయలను కట్ చేసేముందు, తర్వాత కత్తిని, కట్టింగ్ బోర్డును సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  9. ఇంటి బయట గానీ, కారులో, గ్యారేజ్ లో గానీ ఆహారాన్ని నిల్వ చేయడం, ఉంచడం అసలు మంచిది కాదు.
  10. ఆహార పదార్థాలను కడిగిన సింక్ ను వెంటనే శుభ్రం చేయాలి.
  11. ఆహార ప్యాకేజీల విషయంలో, వాటిని ఆల్కహాల్ ఆధారిత ద్రావణం లేదా సబ్బు, శుభ్రమైన నీటితో శుభ్రపరచాలి

వీధి వంటకాలతో జర భద్రం:
రోడ్లపై తోపుడుబండ్లపై, చిన్న చిన్న హోటళ్లలో వండే వంటకాల్లో అధిక కొవ్వు ఉంటుందని.. వాటిని తినేవారు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. ఆ వంటకాల్లో వాడే వంటనూనెల్లో ద్రవీకృత ఘనపదార్థాలు 25 శాతానికి మించకూడదని.. కానీ చాలాచోట్ల 40 శాతానికి పైగా ఉందని తేలిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకసారి వంట చేసిన తరవాత అదే వంటనూనెను మళ్లీ ఇతర పదార్థాలను వండటానికి వాడకూడదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్లో ని కంకారియా చెరువు వద్ద ఆహార భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసిన వీధి వంటకాల హబ్  దేశంలోనే ఆదర్శ హబ్ గా మారింది. ఇలాంటివి దేశంలో మరో 150 హబ్ లు ఏర్పాటు చేయాలని మండలి లక్ష్యంగా పెట్టుకుంది.
Famous Books:






Vegetable, health, corona, doctor, wash, fruits,  కూరగాయలు.

Comments