కరోనావైరస్ కొత్త లక్షణాలు ఇవే.. ఓసారి చెక్ చేసుకోండి..!
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. ఎప్పుడు.. ఎవ్వరికి.. ఎలా.. ఎక్కడి నుంచి కరోనా సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది... దీంతో.. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి వచ్చిన వైరస్.. మొదట నగరాలు, పట్టణాలు, ఆ తర్వాత పల్లెలు ఇలా.. అంతా ఎగబాకుతోంది.. ఇక, కరోనా వైరస్ లక్షణాలు ఎప్పటికప్పుడు కొత్తవి గుర్తిస్తున్నారు. మరికొందరిలో.. ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది..
కరోనా వైరస్ లక్షణాల్లో ఇప్పటి వరకు జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గు.. ప్రధానంగా ఉండగా.. ఆ తర్వాత వాసన గ్రహించే శక్తిని కోల్పోయి కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. అంతే కాదు.. రుచి కూడా తెలియని లక్షణం కూడా ఒకటి ఉందని తేల్చారు.. అయితే.. కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు వైద్య నిపుణులు తేల్చారు.. తలనొప్పి, వాంతులు, విరేచనాలను సాధారణ అనారోగ్య సమస్యలుగా పరిగణించకుండా.. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలని సూచిస్తున్నారు వైద్యులు. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతున్న కరోనా లక్షణాలను ఓ సారి చూస్తే.. 1. జ్వరం లేదా చలి జ్వరం, 2. దగ్గు, 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, 4. ఆయాసం, 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు, 6. తలనొప్పి, 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, 8. గొంతునొప్పి, 9. జలుబు, 10. వాంతులు, 11. విరేచనాలుగా ఉన్నాయి.. రోజుకురోజుకూ విస్తరిస్తోన్న ఈ వైరస్‌లో మరెన్ని కొత్త లక్షణాలు బయటపడతాయో చూడాలి మరి.
Famous Books:

corona lakshanalu, doctors, corona vairus new symptoms, corona, treatment
Comments
Post a Comment