ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త.. ఆగస్టు నుంచి:
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఆగస్టు నుంచి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఈ పెన్షన్‌ని గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేయనున్నారు.
Also Read :రూ.2వేలు మీకు వస్తాయో రావో తెలుసుకోండిలా
ఏపీలో పింఛన్‌దారులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆగస్టు నుంచి పెన్షన్ మొత్తం పెరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్‌దారులకు నెలకు రూ.2,250 వస్తుంది. వచ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయలు అందనుంది. పింఛన్ డబ్బును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికావడంతో.. ఆగష్టు నుంచి పెన్షన్ మొత్తం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఈ పెన్షన్‌ని గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేయనున్నారు.
మరోవైపు పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. అర్హులందరికీ పింఛన్లు అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుంది. కొత్త దరఖాస్తులను పరిశీలించి వారు అర్హులుగా తేలితే కేవలం 5 రోజుల్లో పింఛన్ మంజూరు చేస్తారు. ఆ మరుసటి నెల నుంచి లబ్ధిదారునికి ఆ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఈ నూతన విధానం ద్వారా పింఛను దరఖాస్తుదారుడు మండలాఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు.
గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజాబాబు కొత్తగా పింఛన్ మంజూరులో వివిధ దశల ప్రక్రియను వివరించారు.
Also Read : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
పింఛన్‌కు దరఖాస్తు ప్రక్రియ, మంజూరు ఇలా..
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా గానీ లేక గ్రామ/ వార్డు వలంటీరు ద్వారా గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తును ఇవ్వాలి.
దరఖాస్తు సమయంలో సంబంధిత వ్యక్తి అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలన్నీ సమర్పించాలి.
సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ ఆ దరఖాస్తును స్వీకరించి, వివరాలన్నీ అన్‌లైన్‌లో నమోదు చేసి, దరఖాస్తుదారునికి ఒక రశీదు అందజేస్తారు.
Also Read: భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
దరఖాస్తుదారుడికి సంబంధించి ప్రభుత్వ రికార్డులో నమోదైన వివరాలతో దరఖాస్తులోని వివరాలను పోల్చి చూస్తారు. 9 స్థాయిల్లో పరిశీలన జరిగి.. ఆ దరఖాస్తుకు సంబంధించి ఒక నివేదిక తయారవుతుంది.
ఆ తర్వాత ఈ వివరాలన్నీ గ్రామ, వార్డు సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వద్దకు చేరుతాయి.
వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ క్షేత్రస్థాయిలో అన్నీ పరిశీలించి సమగ్ర నివేదిక తయారుచేస్తారు.
ఈ నివేదికను గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓకు, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్‌కు అందజేస్తారు.
ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు నివేదికలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హత నిర్ధారించి పింఛను మంజూరు చేస్తారు.
Also Read: సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
ఈ మంజూరు పత్రాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిన తర్వాత వాటిని వలంటీర్ ద్వారా లబ్ధిదారుని పంపిణీ చేస్తారు.
దరఖాస్తు చేసుకున్న 5 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేసి, దరఖాస్తుదారుడు పింఛనుకు అర్హుడో కాదో నిర్ధారిస్తారు.
పింఛను మంజూరు అయితే లబ్ధిదారునికి ఆ మరుసటి నెల నుంచి డబ్బులు పంపిణీ చేస్తారు.
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
ap pension, ap pension apply online, pension application, ysr pension eligibility, ap pension rules in telugu, ap new pension list 2020, pension case status online, ap, 2020, ysr pension complaint number
Comments
Post a Comment