Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు? Plasma therapy explained | Coronavirus


కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువచ్చింది. కరోనావైరస్ కారణంగా సంభవించే ఈ అంటువ్యాధి, యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా, అగ్రరాజ్యమైన అమెరికాలో మరణ మృదంగం మోగించింది. అంతేకాదు, ఇటలీ మరియు సమీప దేశాలలో ఎక్కువ హాని చేస్తున్నట్లు కనిపించింది. అయితే, ప్రస్తుతం అమెరికా పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

భారతదేశంలో కూడా, ఈ కరోనావైరస్ వ్యాధి జనాభాను ప్రభావితం చేసింది. మన దేశం మొత్తం ఈ కోవిడ్ -19 మహమ్మారితో బాధపడుతుందని కూడా చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు ఈ సంక్రమణను నివారించడానికి లేదా ఈ సంక్రమణ అని చెప్పడానికి యాంటీబాడీస్ తయారీకి తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఈ నోవల్  కరోనా వైరస తో పోరాడడంలో శాస్త్రవేత్తలు సమర్థవంతమైన అనేక పద్ధతులను కనుగొన్నారని లేదా అన్వేషిస్తున్నారని చెప్పొచ్చు. ఈ చికిత్సలలో ఒకదాని గురించి మనం మాట్లాడితే, కరోనావైరస్ గురించి ప్లాస్మా థెరపీ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది.

ఈ  ప్లాస్మా థెరపీ చికిత్సలో, కరోనావైరస్ యొక్క అంటువ్యాధి నుండి బయటపడిన ప్రజలు, వారు దానం చేసిన రక్తాన్ని తీసుకొని యాంటీబాడీని ఉత్పత్తి చేస్తారు. ఈ కరోనావైరస్ వ్యాధి బారిన పడిన వారిపై ఇది జరుగుతుంది. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, ఈ అంటువ్యాధి సంక్రమణను నివారించడంలో లేదా ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఎంత ప్రభావవంతంగా ఉందో, చికిత్స ఎలా పనిచేస్తుందో,అనే విషయాలను గురంచి ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ రోజు మీకు వీటన్నిటి గురించి సవివరమైన సమాచారం ఇవ్వబోతున్నాం.
Also Readవైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు
కరోనావైరస్ సోకినవారి శరీరంలో వైరస్‌తో పోరాడడానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ క్రమక్రమంగా పెరిగి ప్లాస్మా(రక్తంలోని ద్రవ పదార్థం)లోకి చేరుతాయి. ఈ ప్లాస్మాను కోవిడ్-19 చికిత్స పొందుతున్నవారి శరీరంలోకి ప్రవేశపెడితే యాంటీబాడీస్ సంఖ్య పెరిగి వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలిగే అవకాశం ఉంది.

ప్లాస్మా థెరపీ కొత్తదేం కాదు. చాలా ఏళ్లుగా అనేక వ్యాధులకు చికిత్సలో భాగంగా దీన్ని వాడుతున్నారు.

మొట్టమొదటిసారిగా జర్మన్ ఫిజియాలజిస్ట్ ఎమిల్ వాన్ బెహ్రింగ్ ప్లాస్మా థెరపీని డిప్తీరియా వ్యాధి చికిత్సకు వాడినందుకుగానూ 1901లో నోబెల్ బహుమతి పొందారు.

ప్రస్తుతం కరోనావైరస్ రోగులకు చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీని సూచిస్తున్నారు.

గత రెండు నెలల్లో ప్లాస్మాకి డిమాండ్ అమాంతంగా పెరిగింది. కానీ సప్లై అంతంతమాత్రంగానే ఉంది.

కోవిడ్-19 సోకినవారిలో ఎక్కువమంది వ్యాధి తగ్గిన తరువాత ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. దీనితో ప్లాస్మా డిమాండ్‌కు, సప్లైకు మధ్య తేడా విపరీతంగా పెరిగిపోయింది.

చాలా రాష్ట్రాల ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీవైపు మొగ్గు చూపుతున్నారు.

మహరాష్ట్ర, దిల్లీలాంటి రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్లాస్మా దానం చేసేందుకు వీలుగా సేకరణ కేంద్రాలను నెలకొల్పారు.

ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.
Also Readకరోనా వైరస్ సోకకుండా విటమిన్-డి
అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.

అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.

ప్లాస్మాను ఎలా తీస్తారు?
ఎలాంటి సమస్య లేదని నిర్ధరించుకున్న తర్వాత, దాత నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది.

“ప్లాస్మాలో మాత్రమే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీస్తాం. దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున, నలుగురు రోగులకు ఎక్కించవచ్చు. అందుకే నాలుగు ప్యాకెట్లలో నింపుతాం” అని డాక్టర్ అనూప్ కుమార్ వివరించారు.
Also Read నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
అలా సేకరించిన ప్లాస్మాను కోవిడ్ -19తో బాధపడుతున్న రోగులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, మరెవరికీ ఇవ్వకూడదని డాక్టర్ దేబాషిష్ గుప్తా చెప్పారు.

కోవిడ్-19 కేసులలో సాధారణ చికిత్సకు కోలుకోని రోగులకు ప్లాస్మా థెరపీ వాడొచ్చని డాక్టర్లకు సూచిస్తున్నారు.

కరోనావైరస్‌కు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచంవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఈ అధ్యయనాలనుబట్టీ కచ్చితంగా ఒక నిర్థరణకు రావడం కష్టమే. కోవిడ్-19 కేసులకు ఈ చికిత్స కచ్చితంగా పనిచేయదు అని చెప్పలేము, అలాగని ఈ చికిత్సను కొట్టిపారేయలేము అని డాక్టర్లు అంటున్నారు.

"కోవిడ్-19 చికిత్సకు ప్లాస్మా థెరపీ కచ్చితంగా పని చేస్తుందని ఇంత త్వరగా చెప్పలేము. ఇంకొంత పరీక్షించవలసి ఉంటుంది" అని దిల్లీకి చెందిన వైరాలిస్ట్ డా. షహీద్ జమీల్ అన్నారు.

"ఇటువంటి అధ్యయనాలకు దీర్ఘకాలికంగా క్లినికల్ ట్రయిల్స్ జరగాలి. ఎక్కువ వైవిధ్యం ఉన్న పెద్ద పెద్ద సమూహాల మీద ట్రయల్స్ జరపాలి. తద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుని ఒక నిర్థరణకు రావాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

చైనాలో ప్లాస్మా థెరపీ ట్రయల్స్ సత్ఫలితాలనిచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌లో రోగులకు ప్లాస్మా చికిత్సతోపాటూ వేరే చికిత్సలు కూడా అందించారు.

"ప్రస్తుతం కోవిడ్-19 కేసులకు ఇది కచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేము" అని ప్రొఫెసర్ ఆంటొనీ గార్డన్ అన్నారు. ప్రొఫసర్ గార్డన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో క్రిటికల్ కేర్ అధిపతిగా ఉంటూ ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

అయితే ఇండియాలో మాత్రం ప్లాస్మా థెరపీ కచ్చితంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. దీని గురించి రాజకీయ నాయకులు కూడా చురుకుగా ప్రచారం చేస్తుండడంతో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది.

"ప్లాస్మా థెరపీ కావాలాని డిమాండ్ చేస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది" అని మెదాంత హాస్పటిల్ ఇంటెన్సివ్ కేర్ డైరెక్టర్ డా. సుశీల కటారియా అన్నారు.
Also Readకరోనా వచ్చినా భయపడక్కర్లేదు
"దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్లాస్మా చికిత్స కచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలపడిపోతోంది. కానీ ఈ చికిత్స ఎవరికి అందించాలి అనేది వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. అన్ని కోవిడ్-19 కేసుల్లోనూ ప్లాస్మా థెరపీని సూచించలేము" అని ఆమె అన్నారు.

"ప్రస్తుతం క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఎక్కువ డాటా కావాలి. దాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలి. ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్-19ను జయించవచ్చు అనే అభిప్రాయాన్ని రోగులకు, వారి కుటుంబ సభ్యులకు కలగజేయడం మంచిది కాదు" అని ఆయన అన్నారు.

మే నెలలో అద్వతీయ మల్ మామగారికి కోవిడ్ సోకి ఊపిరి అందని పరిస్థితుల్లో ఇతర చికిత్సలు కూడా ఫెయిల్ అవ్వడంతో డాక్టర్లు ప్లాస్మా థెరపీ సూచించారు. అయితే వారికి వెంటనే ప్లాస్మా డోనర్స్ దొరకలేదు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్లాస్మా థెరపీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మల్, ఢూండ్ (Dhoond) అనే ప్లాస్మా డొనేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్లాస్మా కావాలసిన వారికి, ప్లాస్మా దానం చేసేవారి వివరాలు అందిస్తారు.

అయితే మొదట్లో ఈ వెబ్‌సైట్‌ నిర్వహించడం కష్టమైందని, సాధారణ రక్తదాన కేంద్రం అనుకుని అనేకమంది రిజిస్టర్ చేసుకున్నారని మల్ తెలిపారు. తరువాత ఒక వలంటీర్ బృందాన్ని ఏర్పరచుకుని ప్లాస్మా దానం చేసేవారి వివరాలను మాత్రమే పొందుపరచగలిగే జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎంతోమంది కోవిడ్-19 రోగులు ప్లాస్మా థెరపీ అందక నిరాశకు గురవుతున్నారు. అయితే వారిని తప్పుపటలేమని ఎపిడమాలజిస్ట్ డా. లలిత్ కాంత్ అభిప్రాయపడ్డారు.
Also Readఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ రాకుండా ఆపగలం
"ప్లాస్మా థెరపీ గురించి వార్తల్లో అధిక ప్రచారం జరుగుతున్నప్పుడు, ప్రజల్లో ఒక గుడ్డి నమ్మకం ఏర్పడిపోతుంది. ఇందులో వారి తప్పేమీ లేదు" అని ఆయన అన్నారు.
Also Readకరోనా వైర‌స్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే.. ఓసారి చెక్ చేసుకోండి
ప్లాస్మా థెరపీ ఎందుకు?
కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి, మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదు.
వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు కూడా దీనిని వాడారు.
ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్‌ సహా, 2009లో వచ్చిన హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు.
Famous Posts:

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ

దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?

ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు 

వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 

ప్లాస్మా అంటే ఏమిటి?, ప్లాస్మా, కరోనావైరస్, ప్లాస్మా థెరపీ, plasma therapy,CoronaVirus, covid-19, what is plasma therapy, what is plasma therapy in telugu, what is meant by plasma therapy in telugu, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు