Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Secunderabad Ujjaini Mahankali Bonalu History | Temple Information | Hindu Temples Guide| సికింద్రాబాద్ ఉజ్జయిని మహకాళి బోనాలు ఆలయ చరిత్ర

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్ :
తెలంగాణా సాంప్రదాయ పండుగలలో మొదటిది బోనాల పండుగ. ఈ పండుగ దక్షిణాదిలో కుంభమేళా వంటి వాతావరణం కనిపిస్తుంది. పూర్వ కాలం నుంచి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించే సంప్రదాయం కలదు. పూర్వం నిజాం కాలంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ప్రాణాంతకరమైన మలేరియా వ్యాధి ప్రబరిలింది. చూస్తూ ఉండగానే చాలా మంది ఆ వ్యాధికి బలైనారు. ప్రకృతి ప్రకోపాని గమనించిన పెద్దలు ఆ ప్రకృతి మాతని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించినరు. ఈ జాతర ఉద్దేశ్యం భయకర, ప్రాణాంతకరమైన వ్యాధిల నుంచి కాపాడమని వెడుకోవాడమే. ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్న పేరు బోనాలు. ఆషాడ మాసంలో దేవి పుట్టింకి వెళుతుంది అని నమ్మకం అందుకు ఈ సమయంలో భక్తులు దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్దలతో, ప్రేమనురాగలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమార్పిస్తారు. 


ఈ తంతును "ఊరడి" అని అంటారు. వేరువేరు ప్రాంతాలలో పెద్ద పండుగ. బోనాల పండుగ ఆషాడ మాసంలో తొలి ఆదివారం నాడు ప్రారంభం అవుతాయి. గోల్కొండ నుంచి ప్రారంభం అవుతాయి. ఘట్టంతో అమ్మవారికి పూర్ణకుండ స్వాగతం అన్న మాట. ఆవాహన చేసిన కలషాలను పురవీధులలో ఊరేరిగింపు చేస్తారు. ఈ బోనాలు ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి సమర్పించ తరువాత ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వెలుతారు. ఇందుకోసం కొత్త కుండని వాడుతారు. కానీ నేడు ఇతడి లేదా సిల్వర్ బిందెలను వాడుతున్నారు. పరమ పవిత్రంగా నిష్టగా అన్నం వండి కుండాలలో ఉంచి ఘట్టానికి కుంకుమ్మ, పసుపులతో , వేప ఆకులతో అలంకరించి పూజ మొదలు పెడుతారు. ఆ కుండ పై ఒక దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా మరియు ఆ ఘట్టాలని తీసుకొని వస్తారు. మంగళ వాయిద్యాలు ,  డప్పు చప్పులు, పోతారాజుల నృత్యలతో ఊరేరిగింపు  వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇలా బోనం తలపై పెట్టుకున్న మహిళలను అమ్మ శక్తికి ప్రతికంగా భావించి వారి కాళ్ళకు దండం పెట్టి వారి పాదాలకు నీటితో అభిషేకం చేస్తారు. అమ్మకు అన్నం, జానపద భాషలలొ "సాకం" అంటే వండిన ఆహారం, పాకం అంటే వండనిది. వీటిని ప్రసాదంగా అందరికీ తిరిగి పంచుతారు. అమ్మవారికి సాకం సమర్పించడం సాంప్రదాయం కనుక ఆ సంధర్భంగా వేప కొమ్మలను పసుపు నీటిలో ఉంచి అమ్మవారికి వండిన ఆ ఆహారని సమర్పిస్తారు. ఇలా ఇవ్వడానే సాకం అని అంటారు. ఇలా అమ్మవారికి  సమర్పించడం వల్ల భవిష్యత్ లో అన్నపానాలకు లోటు రాకుండా ఉంటుంది అని భక్తుల నమ్మకం. గోల్కొండ కోటలో ఉన్న జగదాంబ అమ్మవారి ఆలయంతో ప్రారంభం అయ్యి ఈ ఉత్సవాని తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం ఆ తరువాత ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయం, అక్కన మాధన్న మీదుగా నెలన్నర రోజుల పాటు సాగుతుంది. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయాంలో జరిగే బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తారు. శివసత్తులతో పోతారాజుల నృత్యలతో, బోనం ఎత్తిన మహిళలతో అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు.  ఈ ఆలయంలో అమ్మవారికి 207 సం|| చరిత్ర కలదు. ఈ ఆలయం నిర్మాణంకు ప్రేరణ ఒక ఆర్మీ జవాన్ అంటే నమ్మగలరా. 

అవును ఇది నిజం. సికింద్రాబాద్ నివాసి అయిన "సూరటి అప్పయ్య" 1813 ప్రాంతంలో ఆర్మీలో డోలి బేరర్ గా పని చేసేవారు. అతను బదిలీ పై మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్ళాడు. ఆ సమయంలో కలరా వ్యాధి ప్రబలి వేలాది మంది చనిపోయారు. అప్పడు అప్పయ్య ఉజ్జయినిలోని మహాకాళి మాతని దర్శించుకున్నారు. ఆ ప్రాంతం నుంచి కలరా వ్యాధి ప్రారధోలితే సికింద్రాబాద్ లో అమ్మవారికి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తాను అని మొక్కుకున్నారు. 


ఆయన కోరిక నెరవేరడంతో 1815 సం || లో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోటునే అమ్మవారిని కట్టే విగ్రహం ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహాకాళిగా నామకరణం చేశారు. ఆ ప్రాంతం అంట అప్పటి కాలంలో అడవిలాగా ఉండేది. ప్రక్కనే ఉన్న బావి మరమత్తు చేస్తూ ఉండగా అందులో శ్రీ మణిక్యాలమ్మ విగ్రహం లభ్యమైనది. ఈ విగ్రహం అమ్మవారి కుడి వైపున ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి సూరటి అప్పయ్య గారి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మ కర్తలుగా వ్యవహరిస్తున్నారు. 


1953లో దేవాదాయ ధర్మదాయ శాఖ ఈ ఆలయని అధీనంలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతు వస్తుంది.  ఈ ఆలయంలో రెండు రోజులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి రోజు బోనాల సమర్పణ, రెండవ రోజు ఘట్టాల ఊరేరిగింపు. ఈ రెండవ రోజు ప్రత్యేకమైనది. ఈ రోజున అమ్మవారు ఈ స్వర్ణ లత మహిళాలోకి ప్రవేశించి భవిష్యవాణి వినిపిస్తారు. కానీ నేడు కరొన వైరస్ దృష్ట్యా అధిక రద్దీ లేకుండా అందరూ ఇంటిలోనే ఈ పండుగ జరుపుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించినది.

ఆలయ దర్శన సమయం :

ప్రతి రోజు 6.00AM-12.00PM
12.00PM-4.00PM విరామం
4.00PM-9.00PM వరకు

బోనాల పండుగ రోజు ఉదయం : 4.00 నుంచి రాత్రి 10.00 వరకు తెరిచి ఉంటుంది.

ఆలయానికి చేరుకునే విధానం :

బస్ మార్గం :

మెహింది పట్నం నుంచి 5K, 5M, 49M బస్ లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటాయి. 

హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి కూడా బస్ లు కలవు. 

రైలు మార్గం :

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1.5 దూరంలో కలదు. 

ప్రతి 1 గంటకు ఫలక్ నామ నుంచి లింగంపల్లి ట్రైన్ ఈ స్టేషన్ మీదుగా వెళుతుంది. 

ఆలయ చిరునామా :

శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం,
జనరల్ బజార్,
సికింద్రాబాద్,
పిన్ కోడ్ : 500003. 
తెలంగాణా. 

Key Words : Secunderabad Ujjaini Mahankali Bonalu Temple History, Telangana Bonalu, Telangna Festivals, Hindu Temples Guide

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు