Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ముక్కు, గొంతే కాదు చెవుల ద్వారా కూడా కరోనా | Signs of an ear infection | Covid-19


"కరోనా మహమ్మారి రోజు రోజుకు తన మనుగడను పెంచుకుంటూ పోతుంది. మొన్నటివరకు ముక్కు,నోరు ద్వారా శరీరంలోకి ఈ మహమ్మారి ప్రవేశిస్తుంది అని అందరూ భావించారు, అయితే ఇప్పుడు తాజా గా జరిపిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు వ్యక్తం అయ్యాయి.

కరోనా వైరస్‌  కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందనే అంచనాలను తాజాగా పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మాస్టాయిడ్ ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చింది.

కోవిడ్‌​-19 తో మరణించిన రోగులపై హెడ్‌ అండ్‌ నెక్‌ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. కరోనా అంతం సాధ్యం కాదు! జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉ‍న‍్నట్టు గుర్తించారు. కరోనాతో చికిత్స పొంతుదున్న రోగుల మరణానికి ముందు వారి నమూనాలను సేకరించి ఈ పరిశోధన నిర్వహించినట్టు వెల్లడించారు.ఇప్పటి వరకు ముక్కు, గొంతు, ద్వారా ఊపిరితిత్తులలోకి పాకుతుందని అందరికీ తెలుసు. చెవిలోని ప్రధాన భాగమైన మస్టాయిడ్ (కర‍్ణభేరి) ప్రాంతంలో వైరస్‌ను తాజాగా గుర్తించారు. 80 ఏళ్ల మహిళకు కుడి మధ్య చెవిలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణబేరిలోనూ, ఎడమ,కుడి మధ్య చెవులలో వైరస్‌ను గుర్తించామని తెలిపారు. అయితే కరోనా అత్యంత తీవ్రంగా ఉండేవారికి మాత్రమే చెవుల్లోకి ప్రవేశిస్తుందా లేదంటే బయట నుంచి చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందా అనేదానిపై స్పష్టత లేదని, దీనిపై మరిన్నిపరిశోధనలు అవసరమని వీరు భావిస్తున్నారు. చెవుల స్వాబ్‌ను కూడా పరిశీలించాలని ఈ అధ్యయన బృందం సర్జన్లను హెచ్చరించింది. అలాగే సకింగ్ ట్యూబ్స్‌ ద్వారా మధ్య చెవి స్వాబ్‌ సేకరించే సమయంలో సర్జన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. హెన్రీ ఫోర్డ్‌లోని ఓటోలారింగాలజీలో ఈ స్టడీ ప్రచురితమైంది. కరోనా వైరస్ చెవి ఇన్ఫెక్షన్లు లేదా చెవి సమస్యలతో ముడిపడి ఉందని వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్, 2020 నాటి ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు. అంతకుముందు వినికిడి సమస్యల చరిత్ర లేకపోయినా, కరోనా సోకిన తరువాత ఈ సామర్ధ్యం క్షీణించినట్టు మరో అధ్యయనంలో కనుగొన్నారు.

ఇప్పుడు ఈ మహమ్మారి చెవుల నుంచి కూడా వ్యాపిస్తుంది అని నిపుణులు చెప్పడం తో ఇక జనాలు ఏమి ధరించి బయటకురావాల్సి వస్తారో  చూడాలి.

ఈ మహమ్మారికి ఎలాంటి మందు లేకపోవడం తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర కు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 6 లక్షల 40 వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోజు రోజుకు ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మహమ్మారికి ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తల్లో ఉండాల్సిందే అంటూ పదే పదే హెచ్చరిస్తుంది.
Famous Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

coronavirus symptoms, coronavirus treatment, what is coronavirus, covid-19, coronavirus symptoms, coronavirus symptoms day by day, coronavirus treatment, coronavirus symptoms vs cold, what is a coronavirus, coronavirus symptoms 2020

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు