Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు ఆలయ చరిత్ర లాల్ దర్వాజ | Simhawahini Sri Mahankali Bonalu History Lal Darwaza | Temple Information | Hindu Temples Guide |

సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం, 
లాల్ దర్వాజ :

తెలంగాణా సంప్రదాయ పండుగలలో మొదటిది బోనాల పండుగ. ఆషాడ మాసంలో మొదటిది ఆదివారం గోల్కొండలో మొదలు అయి ఒక నెల రోజుల పాటు సాగుతుంది. చివరన హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారితో ఈ పండుగ ముగుస్తోంది.  ఈ ఉత్సవాని చూడడానికి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఈ ఉత్సవాంలో పాల్గొంటారు. ఈ పండుగ 2రోజులు పాటు జరగనుంది. మొదటిరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం. 2వ రోజు రంగం కార్యక్రమం జరుతుంది. 


ఈ కార్యక్రమం చూడడానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. బోనం తమరు చేసే విధానం ఇందు కోసం కొత్త కుండని వాడుతారు. పవిత్రంగా అన్నం వండి కుండలలో ఉంచి, ఘట్టానికి కుంకుమ్మ, పసుపులతో అంకరణ చేసి వేప ఆకులతో చక్కగా అలంకరణ చేసి పూజ మొదలు పెడుతారు. 

ఈ ఘట్టం మారియు బోనం పై దీపం వెలిగించి తల పై తీసుకొని వెలుతారు. పోతారాజుల నృత్యాలు, బోనం ఎత్తిన మహిళలు, శివసత్తుల విన్యాసాలు మధ్య అంగరంగ వైభవంగా నివాహిస్తారు. ఈ బోనలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదలకి నీటితో అభిషేకం నిర్వహించి నమస్కరిస్తారు. 


లాల్ దర్వాజ బోనాల చరిత్ర :

పాత బస్తిలో ఏన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ అందులో అందరిచే పూజలు అందుకుంటూ మొదటి స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి దేవి ఆలయం. 


1908 సం || లో మూసి నదికి వరద పోటు ఎత్తితే హైదరాబాద్ ప్రజలు అందరూ అలకలోలం అయిపోయారు. అప్పుడు ఈ ప్రాంతని పరిపాలిస్తున్న 6వ నిజాం ప్రభువు "మహమ్మద్ అలీ ఖాన్" అనే వ్యక్తి, అతని దగ్గర ప్రధానిగా పని చేసే "కిషన్ ప్రసాద్" రాజుగారికి ఒక సలహా ఇస్తాడు. మహారాజు వరద పోటు ఎత్తినది. 


వరద తగ్గుముఖం పట్టాలి అంటే లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహిస్తే వరద తగ్గుముఖం పడుతుంది అని ఒక సారి ఆలోచించండి అని సలహా ఇస్తాడు. అప్పుడు "కిషన్ ప్రసాద్"  ఇచ్చిన సూచన మేరకు 6వ నిజాంగారు అమ్మవారికి పూజలు నిర్వహించి ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు పెట్టి మేలిమి ముత్యాలు, నగలు, బంగారు గాజులు, కుంకుమ, పసుపు, పెట్టి  వాటిని అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి వాటిని మూసి నదిలో వదిలి పెడుతారు. అలా మూసి నదిలో వదలడం వల్ల వరద తగ్గుముఖం పట్టి హైదరాబాద్ మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. 


అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించి అందరినీ చల్లగా చూడమ్మా అని మొక్కుకుంటారు. ఈ ఉత్సవంలో లోతుగా గమనించి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. పూర్వం మన పెద్దలు  బాగా ఆలోచించి ఆచరణ కు ఆమోదయోగ్యం అయే విధంగా నిర్మాణం చేశారు అనగా ఈ కాలంలో వాతావరణంలో భారీ మార్పులు జరుగుతాయి. విస్తారంగా వర్షాలు కూరుస్తాయి. ఆ సమయంలో అంటు వ్యాధులు ప్రభాలకుండా పసుపు, వేప ఆకులతో కలిసిన నీరు యాంటీ బయోటిక్ గా ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు శాస్త్రాలను పండుగలుగా కలిపి ఇంటి గుమ్మలకు పసుపు, తోరణాలకు మామిడి ఆకులను కడుతారు. ఇప్పుడు ఈ విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అందరూ తొందరగానే ఆసుపత్రి పాలు అవుతున్నారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం మరోక ఎత్తు. 


రెండవ రోజు రంగం కార్యక్రమం, రధోత్సవం ఈ కార్యక్రమానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అమ్మవారు ఒక మహిళాలోకి అవహించి భవిష్యత్ లో జారిగే పరిణామాలు మొదలగు వాటి గురించి భవిష్యవాణి వినిపిస్తారు. ఈ భవిష్యవాణి వినడానికి భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. రధోత్సవం కార్యక్రమం లాల్ దర్వాజ ఆలయం నుంచి మొదలు పెట్టి అక్కన్న మధన్న ఆలయం మీదుగా కలుపుకొని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం మీదుగా కొనసాగి చివరికి హై కోర్ట్  మూసి నది వద్దగల అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది. కానీ నేడు కరొన వైరస్ దృష్ట్యా అందరూ ఈ పండుగను ఇంటిలోనే నిర్వహించుకోవాలి అని ప్రభుత్వం ఉతర్వూలు జారీ చేసింది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం 6:00-12:00వరకు 
మధ్యాన్నం 12:00-4:00 విరామం 
సాయంత్రం 4:00-8:00 గంటల వరకు 
ఈ బోనాల పండుగ సమయంలో ఉదయం 4:00 నుంచి తెరిచి ఉంటుంది. 

ఆలయానికి చేరుకునే విధానం : 

బస్ రూట్ :

చాంద్రాయన్ గుట్ట నుంచి కేవలం 2కి.మీ దూరంలో ఉన్నది. 
ఉప్పుగూడ నుంచి కేవలం 500మీ దూరంలో కలదు. 
చార్మినార్ నుంచి 4కి.మీ దూరంలో కలదు. 
కోఠి నుంచి 6కి.మీ దూరంలో ఈ ఆలయంకలదు. 
సిబిఎస్ మరియు అఫ్జల్ గంజ్ నుంచి ప్రతి 10నిమిషాలకి ఒక ఆటో బయలుదేరుతుంది.

ట్రైన్ రూట్ :

దేశంలోని అన్నీ నగరాల నుంచి మొదట సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి MMTS టైన్ లో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కి చేరుకుంటే అక్కడి నుంచి నడక దారిలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఆలయ చిరునామా :

సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం,
లాల్ దర్వాజ,
ఉప్పుగూడ,
పాత బస్తి,
హైదరాబాద్. 
పిన్ కోడ్-50065

keywords : Simhawahini Sri Mahankali Bonalu History, Lal Darwaza Temple Information, Lal Darwaza Hyderabad Bonalu, Telangana Bonalu, Telangana Festival, Bonalu, Hindu Temples Guide

Comments

Popular Posts