భవిష్యత్తులో ఎలాంటి ఆపద లేకుండా బాగా చూసుకుంటా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. | Swarnalatha Bhavishyavani 2022
ఎలాంటి ఆపద లేకుండా బాగా చూసుకుంటా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం (Rangam) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తన భక్తులను ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటానని, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలని, కోరుకున్నది తప్పక నెరవేరుతుందని భవిష్యవాణి చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వనని అమ్మవారి వాక్కుగా చెప్పారు.
ప్రజలు పూజలు మొక్కుబడిగా చేసున్నారు. పూజలు మీ సంతోషానికే చేస్తున్నారు తప్ప.. నా కోసం కాదు. నాకు పూజలు చేస్తున్నారా.. వాస్తవం చెప్పండి. పూజలు ఎలా చేయాలో ఏటా నన్నే అడుగుతున్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా. మీరు నా గుడిలో పూజలు సరిగా సరిపించడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. పూజలు సక్రమంగా, భక్తిశ్రద్ధలతో జరిపించండి. నేను సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నా.
ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు.. మీకు నచ్చినట్లు మారుస్తారా?. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోచినట్లుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీ కళ్లు తెరిపించేందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నా. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను ఏడాదిలోపు నాకు స్థిరంగా చేయండి.
ఎటువంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటా. మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. మీరు ఎన్ని తప్పులు చేసినా నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. గర్భిణులు, బాలింతలకు ఎటువంటి రానివ్వను’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు.
Famous Posts:> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
> ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ
స్వర్ణలత భవిష్యవాణి, telangana, bonalu, Swarnalatha Bhavishyavani 2020, Swarnalatha Bhavishyavani, hyd,
Comments
Post a Comment