Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గాలి ద్వారా కరోనా వ్యాప్తి అంగీకరించిన WHO | Can coronavirus live on hair?

గాలి ద్వారా కరోనా వ్యాప్తి అంగీకరించిన WHO :
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) తొలిసారిగా అంగీకరించింది. దీనికి సంబంధించి సశాస్త్రీయమైన వివరణను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇటీవలే 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని, వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని లేఖ రాసిన నేపథ్యంలో.. తాజాగా డబ్ల్యూహెచ్ వో నుంచి వచ్చిన స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి కొన్ని నెలల క్రితం నుంచే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నా, డబ్ల్యూహెచ్ వో వాటిని అంగీకరించలేదు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వైరస్  వ్యాపిస్తుందని, అయితే ఆ తుంపర్లు బరువు వల్ల గాలిలో కొంత దూరమే ప్రయాణించి, ఆ పరిధిలో ఉండేవారికే సోకే అవకాశముందని ఇప్పటివరకూ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు తొలిసారిగా గాలి ద్వారా సంక్రమణకు సంబంధించిన ఆధారాలన్నాయంటూ వస్తున్న అభిప్రాయాలను గుర్తించింది. అంటే తేలికపాటి తుంపర రేణువుల ద్వారా మరికొంత దూరంలో ఉన్నవారికీ వ్యాపిస్తోంది. డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి డా.బెనెడెట్టా అల్లెగ్రంజి స్పందిస్తూ.. గాలి ద్వారా కరోనా వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తున్న విషయాన్ని మేం గుర్తించాం. ఈ ఆధారాలను మేం పరిగణనలోకి తీసుకున్నాం. బహిరంగ ప్రదేశాల్లో, జనసమ్మర్ద ప్రాంతాల్లో, సరైన వెలుతురు, గాలి ప్రవాహం (వెంటిలేషన్) లేని ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. గాలి ద్వారా ఎలా వ్యాపిస్తుంది, దాని పర్యవసానాలేంటి, దీన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటి అనే దానిపై అవగాహన ఏర్పర్చుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నాం. కొన్ని వారాలుగా ఈ విషయంలో అధ్యయనం చేస్తున్నాం అని తెలిపారు. దీంతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మార్గదర్శకాల్లోనూ మార్పులు రావొచ్చు. మాస్కుల వినియోగం, భౌతికదూరం పాటించే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

కేసులు, మరణాలు ఇంకా పెరగొచ్చు:
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి ఉద్ధృతి మున్ముందు మరింత పెరగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. వైరస్ గరిష్ఠ ఉద్ధృతికి ఇంకా చేరుకోలేదని తెలిపింది. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగొచ్చని వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ ఘెబ్రెయెసస్. ప్రపంచ దేశాల్లో కొవిడ్ చేస్తున్న విలయతాండవం గురించి వివరించారు. కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోంది. దాని వల్ల ఎదురయ్యే అత్యంత ప్రమాదకర స్థితిని మనం ఇంకా చూడలేదు. గత వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 1.20 కోట్లకు చేరగా, 5.48 లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు అని టెడ్రోస్ తెలిపారు. వైరస్ మూలాన్ని కనిపెట్టేందుకు ఈ వారాంతంలో తమ నిపుణులు బృందాన్ని చైనాకు పంపించనుట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు.

Famous Books:








Corona, WHO, Health, Corona,  what is coronavirus, coronavirus symptoms, coronavirus map, coronavirus wikipedia, coronavirus in india, coronavirus news, coronavirus numbers

Comments