Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శానిటైజర్లతో జాగ్రత్త | భారతదేశంలో 10 బెస్ట్ హ్యాండ్ శానిటైజర్స్ | Top 10 Hand Sanitizer


చేతులకు శానిటైజర్ రాసుకోవటం క్షణ కృత్యంగా మారిపోయింది. బయటకు వెళ్లినప్పుడే కాదు, ఇంట్లోనూ వీటిని వాడుకుంటున్నవారు లేకపోలేదు. ఇది మంచి పనే. కాకపోతే జబ్బులు, ఇన్ఫెక్షన్ల నివారణకు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవటమే ఉత్తమమైన మార్గం. ఇది అన్నింటికన్నీ తేలికైనది, సమర్థమైనది. చవకైనది కూడా. అలాగని అన్నిసార్లూ సబ్బుతో కడుక్కోవటం సాధ్యం కాకపోవచ్ఛు బయటకు వెళ్లినప్పుడో, కారు నడుపుతున్నప్పుడో, సరుకులు కొంటున్నప్పుడో కుదరకపోవచ్ఛు ఇలాంటి సమయాల్లో హ్యాండ్ శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వీటి వాడకాన్ని సిఫారసు చేసింది. అయితే శానిటైజర్ల వాడకంలో జాగ్రత్త అవసరం. వీటిని అతిగా, అనవసరంగా వాడకపోవటమే మంచిది. సబ్బుతో చేతులను కడుక్కునే అవకాశం లేనప్పుడు మాత్రమే హ్యాండ్ శానిటైజర్లు వాడుకోవాలి. ఎంత మంచివైనా వీటితో కొన్ని దుష్ప్రభావాలు పొంచి ఉంటాయన్న సంగతి మరవరాదు.
Also Readమరో కొత్త లక్షణంతో కరోనా వస్తుంది.

చాలా శానిటైజర్ల తయారీలో ట్రైక్లోజాన్ అనే రసాయనాన్ని వాడుతారు. ఇది క్రిములను, ఫంగస్ ను చంపుతుంది. శానిటైజర్ నిల్వ ఉండటానికీ తోడ్పడుతుంది. ఇది మనకు హాని చేసే క్రిములనే కాదు, మేలు చేసే క్రిములనూ చంపుతుంది. శానిటైజర్లతో బ్యాక్టీరియా మొండిగా, మందులను తట్టుకునేలా మారుతున్నట్టు (యాంటీబయోటిక్ నిరోధకత) అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ట్రైక్లోజాన్ మూలంగా ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తం అవుతున్నట్టూ తేలింది.
Also Read : ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

శానిటైజర్ల వాసనను బట్టే తెలుసుకోవచ్చు వీటిల్లో ఆల్కహాల్ ఉంటుందని. ప్రధానంగా ఇథెనాల్ ఆల్కహాల్ తో వీటిని తయారుచేస్తారు. ఐసోప్రొపైల్ , ఎన్ ప్రొపనాల్ వంటి ఆల్కహాల్ రకాలనూ వాడుతారు. చాలా శానిటైజర్లలో వీటి మోతాదు 70-90% వరకు ఉంటుంది. ఆల్కహాల్ చర్మం నుంచి సహజ నూనెలను లాగేస్తుంది. దీంతో చర్మం త్వరగా పొడిబారుతుంది. దురద, మంట వంటివి తలెత్తొచ్చు (కాంటాక్ట్ ఇరిటెంట్ డెర్మటైటిస్). శానిటైజర్లలోని యాసిడ్ సైతం చర్మ కణాల్లోంచి నీటిని తోడేస్తుంది. దీర్ఘకాలంలో వీటితో చర్మకణాలు దెబ్బతినొచ్ఛు.

ఆల్కహాల్ కు ఎలాంటి రంగూ ఉండదు. అందుకే ఇంపుగా కనిపించటానికి రంగులు కలుపుతారు. వీటితో అలర్జీ తలెత్తొచ్ఛు సువాసన కోసం లెమన్ , యాపిల్ , వెనెలా పరఫ్యూమ్ ల వంటివీ వినియోగిస్తారు. ఇవీ అలర్జీకి దారితీయొచ్ఛు ఫలితంగా దురద, నొప్పి, మంట పుట్టొచ్చు. చర్మం పొడిబారటం వల్ల చేతుల మీద ముడతలు పడొచ్ఛు పగుళ్లు ఏర్పడొచ్ఛు తెల్లటి పొలుసులు పొట్టుగా రాలొచ్ఛు.
Also Readనీటి ఆవిరితో కరోనా మాయం
కొందరు శానిటైజర్ వాసనలనూ పీల్చుకోవచ్ఛు ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. వీటిని పీల్చుకుంటే దగ్గు, వాంతి, వికారం, కడుపునొప్పి వంటివి తలెత్తొచ్ఛు ముఖ్యంగా పిల్లల్లో ఇలాంటివి కనిపిస్తుంటాయి.

కొందరు పిల్లలు తెలియక పొరపాటున శానిటైజర్ ను తాగొచ్ఛు ముఖ్యంగా మంచి వాసన వేసే, కంటికి ఇంపుగా కనిపించే శానిటైజర్లను తాగే ప్రమాదముంది. శానిటైజర్లలో ఆల్కహాల్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్తే ఊపిరితిత్తులు పనిచేయక ఆయాసం ముంచుకురావొచ్ఛు కోమాలోకీ వెళ్లిపోవచ్ఛు ఇటీవల శానిటైజర్ తాగి కొందరు చనిపోయారని పత్రికలు, టీవీల్లో చూస్తున్నాం కూడా.
Also Readఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ రాకుండా ఆపగలం
అతిగా, అనవసరంగా వద్దు:
శానిటైజర్ క్రిములను చంపుతుందే గానీ దుమ్ము ధూళిని తొలగించలేదు. చేతులకు మట్టి, మురికి అంటుకుంటే శానిటైజర్ తో పెద్దగా ఉపయోగం ఉండదని తెలుసుకోవాలి.
శానిటైజర్ అతిగా వాడితే చేతులు పొడిబారతాయి. కొందరికి చర్మం పగలొచ్ఛు నొప్పి, దురద కూడా ఉండొచ్ఛు కాబట్టి శానిటైజర్ రాసుకున్నాక మాయిశ్చరైజర్ క్రీములు రాసుకుంటే మంచిది. ఇప్పుడు మాయిశ్చరైజర్ తో కూడిన శానిటైజర్లూ ఉన్నాయి. అవసరమైతే ఇలాంటివి వాడుకోవచ్ఛు.
Also Read : కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
హ్యాండ్ శానిటైజర్ చేతులకు రాసుకోవటానికి ఉద్దేశించిందే తప్ప ఇతర భాగాల కోసం కాదు. కొందరు అత్యుత్సాహంతోనో, తెలిసో తెలియకో ముఖానికీ రుద్దుకుంటుంటారు. ఇది ప్రమాదం. శానిటైజర్ కళ్లు, ముక్కులోకి వెళితే మంట, దురద తలెత్తుతాయి.

పెద్దవాళ్ల సమక్షంలోనే పిల్లలు శానిటైజర్లు వాడుకునేలా చూసుకోవాలి. వీలైనంతవరకు పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవటం మంచిది.
Also Readవైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు

భారతదేశంలో 10 బెస్ట్ హ్యాండ్ శానిటైజర్స్:
మీ చేతుల్లో ఉన్న సూక్ష్మక్రిములను చంపడానికి మరియు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో ఏది ప్రభావవంతంగా ఉంటుంది? ఈ వ్యాసంలో, మీరు భారతదేశంలో మీ కోసం కొనుగోలు చేయగల మార్కెట్‌లోని టాప్ హ్యాండ్ శానిటైజర్‌లను జాబితా 
1. డెటోల్ ఇన్‌స్టంట్ హ్యాండ్ శానిటైజర్ ( Dettol Instant Hand Sanitizer)
2. హిమాలయ ప్యూర్‌హ్యాండ్స్ హ్యాండ్ శానిటైజర్ (నిమ్మకాయ) (Himalaya PureHands Hand Sanitizer (Lemon) )
3. లైఫ్‌బాయ్ నిమ్మ తాజా యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ శానిటైజర్ ( Lifebuoy Lemon Fresh Antibacterial Hand Sanitizer)
4. సావ్లాన్ హ్యాండ్ శానిటైజర్ స్ప్రే (Savlon Hand Sanitizer Spray)
5. PURELL అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టంట్ హ్యాండ్ శానిటైజర్ (PURELL Advanced Instant Hand Sanitizer)
6. హిమాలయ స్వచ్ఛమైన చేతులు - గ్రీన్ ఆపిల్ (Himalaya Pure Hands – Green Apple)
7. స్టెరిలియం హ్యాండ్ శానిటైజర్ (Sterillium hand sanitizer)
8. గోద్రేజ్ ప్రొటెక్ హ్యాండ్ శానిటైజర్ స్ప్రే (Godrej Protekt Hand Sanitizer Spray)
9.విట్రో హ్యాండ్ క్రిమిసంహారక ( VITRO Hand Disinfectant)
10. బాడీ షాప్ స్ట్రాబెర్రీ యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ శానిటైజర్ (The Body Shop Strawberry Antibacterial Hand Sanitizer)
Realated Posts:

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

sanitizer, sanitizer price in india, sanitizer ingredients, hand sanitizer, sanitizer spray, sanitizer dettol, hand sanitizer india, sterillium hand sanitizer, sanitizer machine, best sanitizer in India

Comments