ధన్వంతరి నారాయణ మహా గణపతి - ఖైరతాబాద్ :
1954 లో వినాయకుడిని ఒక చిన్న గ్రంధాలయాలో ప్రతిష్ట చేశారు. అలా భక్తుల తాకిడి పెరగడం పెరిగి పెరిగి భారీ స్థాయి లో నిర్వహించడం జరిగినది. ఒక్క అడుగుతో మొదలు చేసి 62 అడుగుల వరకు వెళ్ళి భక్తుల హృదయలలో నిలిచిపోయాడు ఖైరతాబాద్ వినాయకుడు. చరిత్రలోనే మొదటిసరిగా మట్టి వినాయకుడు గా దర్శనం ఇవ్వనున్నాడు ఈ సం మన ఖైరతాబాద్ గణపతి. 11 రోజుల అనంతరం అక్కడే నిమర్జనం చేయనున్నారు.
ఆరోగ్యానికి ఆది దేవుడు ధన్వంతరి దేవుడు. ప్రస్తుతం ప్రపంచం అంతా కరొన బారిన పడి విలవిలడుతోంది. ఈ సమయంలో సకల విఘ్నాలు తొలగి విజ్ఞేశ్వరుడు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేలా ఈ ఏడాది శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా దర్శనం ఇస్తున్నాడు. సహజమైన బంకమట్టితో స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడిన వారు అవూతాము అని కమిటీ ఉద్దేశం.
గత సం అత్యధికంగా 62 అడుగుల ద్వాదశ ఆదిత్యుల గణపతిగా దర్శనం ఇచ్చారు. కానీ ఈ సం || 9 అడుగుల ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఏర్పాటు చేశారు. ఈ గణపతిని ఏర్పాటు చేయడానికి బీహార్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లో సుమారు 30 మంది కార్మికులు పని చేశారు. 22 న స్వామి వారి పూజ ప్రారంభం చేసి సెప్టెంబర్ 1న 9 కలశాలతో అభిషేకం చేసి అక్కడే నిమార్జనం చేస్తారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరొన వైరస్ భారీ నుంచి అందరూ కొలుకొని ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకుందాం. కానీ నేడు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు రావొద్దుని ఉత్సవ కమిటీ సూచించినది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల కరొన సోకే ప్రమాదం ఉందని కావున భకులు www.ganapathideva.org ద్వారా ఆన్లైన్లో గణనాధునని దర్శించుకోవచ్చు అని తెలిపింది. తెల్లవారుజామున 5గంటల నుంచి 10.30 వరకు మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు అతి కొద్ది మందిని మాత్రమే దర్శనలకు అనుమతిస్తున్నారు.
ప్రసిద్ధ గణపతి దేవాలయాలు
బిక్కవోలు
పూజలు - వ్రతాలు
వీడియోలు
keywords : Khairthabad Ganapati , Khairthabad Ganapati 2020 , Journey of Khairthabad Ganapati, Khairthabad Ganapati history,
Comments
Post a Comment