Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది | Unlock 3.0 guidelines


దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ 2.0 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. 

కొద్ది రోజుల క్రితం మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు కేంద్రం హోం శాఖ అనుమతించింది. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు. కేవలం వాటి వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

> 65 ఏళ్ల వయస్సు వారు, అనారోగ్య సమస్యలున్నవారు గర్భిణీ స్త్రీలు, పదేళ్ల వయస్సు లోపు పిల్లలను జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు. ఈ మేరకు సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

> ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. యోగా/వ్యాయామం వంటివి చేసేప్పుడు మాత్రం ఫేస్‌ గార్డ్‌ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వ్యాయామం చేసే సమయంలో ఎన్‌-95 మాస్క్‌లు ధరించకపోవడం మేలని సూచించారు. 

> సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం వంటివి తరచుగా చేస్తుండాలి. అలానే దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి, ఉమ్మటం వంటివి చేయకూడదు. ఆరోగ్య సేతు యాప్‌ ప్రతి ఒక్కరు ఉపయోగించడం ఉత్తమం అని పేర్కొన్నారు.

> వ్యాయమాలు చేసేప్పుడు ప్రతి వ్యక్తికి మధ్య 4 చదరపు మీటర్ల దూరంతో పాటు, జిమ్‌లోని ఫిట్‌నెస్‌ సామాగ్రి మధ్య కూడా 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు చేపట్టాలని సదరు యాజమాన్యాలకు సూచించారు.

> ఎయిర్‌కండిషన్డ్‌ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంచడంతో పాటు, ప్రవేశ, నిష్ర్కమణలకు రెండు దార్లు ఉపయోగించడం మేలని పేర్కొన్నారు. ప్రతి రోజు తప్పని సరిగా డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేయించాలని ఆదేశించారు.

> యోగా శిక్షణలో పాల్గొనే వారి సంఖ్య ఆధారంగా, శిక్షణ తరగతులు షెడ్యూల్ చేసుకోమని సూచించారు. అలానే ప్రతి శిక్షణ తరగతి మధ్య 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఉండాలి.

> స్పా, స్టీమ్‌ బాత్‌, స్విమ్మింగ్ పూల్ వంటివి మూసి ఉంచాలని ఆదేశించారు.

Famous Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

Unlock 3.0, cock down, corona, covid-19, schools, India, ap, ts, today news, 

Comments

Popular Posts