Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కరోనా విషయంలో చాల మంది తెలియక చేసే ఈ తప్పు వల్ల చాల ప్రమాదం జరుగుతుంది | Corona Virus (Covid-19)

కరోనా ప్రతి రోజు ఏదో ఒక కొత్త వార్తను తన విషయంలో మోసుకొస్తుంది.. అందుకే ఈ కరోనా వార్తల వల్ల, భయంతో మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు అనిపిస్తుంది.. ఈ వైరస్ గురించి పత్రికల్లో, సోషల్ మీడియాలో, ఒకటే ప్రచారాలు.. ఇక కరోనాను జయించిన వారు.. మేము ఈ మందులు వాడటం వల్ల, కషాయాలు తాగడం వల్ల, ఇలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల, ఈ వైరస్ బారినుండి త్వరగా బయటపడ్డాం అని వీడియోలు పెట్టడం.

ఇక కొందరైతే డాక్టర్లమని చెబుతూ, కరోనా రాకుండా ఇలా చేయండని, వస్తే ఈ మందు బిళ్లలు వేసుకోండని, ఇలా ఎవరికి తోచిన తీరుగా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఇందతా నమ్మిన జనం దాన్ని విపరీతంగా షేర్ చేసి లేని భయాన్ని కలిగిస్తున్నారు.

 ఇంత వరకు బాగానే ఉంది..కానీ ఓ మీడియా చానెల్‌ చేసిన సర్వేలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందట.. అదేమంటే కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు, కరోనా పాజిటివ్‌ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మందులను వాడుతున్నారు. ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా మందులు వాడడం చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. 
Also Readకరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
ఇలా తెలిసి తెలియక చేసుకుంటున్న సొంత వైద్యంతోనే, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.. ఈ విషయంలో ప్రముఖ వైరాలజిస్ట్‌ అమితాబ్‌ నందీ మాట్లాడుతూ, కరోనా వచ్చిన వ్యక్తి శరీరాన్ని డాక్టర్లు పరిశీలిస్తేనే అతనికి సరిపోయే మందులు సూచించగలరని, చివరికి ఫార్మసీ సిబ్బందికి కూడా కరోనా మందులపై సరైనా అవగాహన లేదని అభిప్రాయపడ్డారు. అందుకే కరోనా విషయంలో సొంత వైద్యం మానుకుంటే మంచిదని.. మిడి మిడి జ్ఞానంతో ఈ వైరస్‌ను జయించాలని చూస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మేలుకొని కరోనా విషయంలో సరైనా అవగహన పెంచుకోగలరు..

Related Posts:
చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

coronavirus treatment, coronavirus treatment update, coronavirus symptoms day by day, corona symptom checker, coved-19, corona virus.

Comments