Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మరో కొత్త లక్షణంతో కరోనా వస్తుంది | Coronavirus New Symptoms | Covid-19

Also Readనీటి ఆవిరితో కరోనా మాయం.!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నవారిలో కొత్తగా వినికిడి లోపంతో పాటు టిన్నిటస్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఎనిమిది వారాల తర్వాత చాలామంది వినికిడి శక్తిని కోల్పోయినట్లుగా వైద్యులు గుర్తించారు. మాంచెస్టర్ యూనివర్సిటీ ఆడియాలజిస్టులు, ఎన్‌ఐహెచ్‌ఆర్‌ మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కలిసి చేసిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. అటు రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలు కూడా కరోనా రోగుల్లో అధికమవుతున్నాయని వైద్యులు తెలిపారు.

Also Read : కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
వినికిడి, ఆడియో వెస్టిబ్యులర్ వ్యవస్థపై కోవిడ్ 19 ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలు తెలిపారు. మాంచెస్టర్ యూనివర్సిటీ ఆడియాలజిస్టుల అధ్యయనం ప్రకారం.. మొత్తం 121 కరోనా రోగులతో వారు ఫోన్ సర్వే నిర్వహించి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. మీలో ఎవరికైనా వినికిడిలో మార్పులు చోటు చేసుకున్నాయా అని అడిగినప్పుడు.. సుమారు 16 మంది(13.2 శాతం) వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయామని చెప్పగా.. మరో ఎనిమిది మంది వినికిడి క్షీణత దిగజారిందని తెలిపారు. ఫేస్ మాస్క్ ధరించడం, కరోనా చికిత్సకు వినియోగించిన మందులు.. వినికిడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. కాగా, కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.
Related Posts:

వైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు
కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?
ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

coronavirus symptoms, coronavirus symptoms day by day, coronavirus disease 2019, what is coronavirus, coronavirus treatment, coronavirus symptoms vs cold, coronavirus symptoms in kids, first symptoms of coronavirus

Comments