దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. మొదట్లో ఏపీలో కేసులు పెరుగుతుంటే... టెస్టులు
పెంచుతున్నారు కాబట్టి... కేసులు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నారు. రాన్రానూ... టెస్టులతో సంబంధం లేకుండా... కేసులు ఎడా పెడా పెరుగుతున్నాయి. జిల్లాలు, ఊళ్లూ, వీధులూ అంతటా కరోనా పాకేస్తోంది. ఇలాంటి సమయంలో... మాస్కులు వాడటం, శానిటైజర్ రాసుకోవడం ఎంత ముఖ్యమో... మంచి ఆహారం తీసుకోవడమూ అంతే ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏం తినాలి అనే అంశంపై ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ చూద్దాం.
> బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్. చిరుధాన్యాలు వంటివి తినాలి.
> బీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.
> ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటివి) ఉండాలి.
> రోజూ కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి.
> పుల్లని నిమ్మ పండు, బత్తాయి తినాలి. వీటిలో వ్యాధిని అడ్డుకునే C విటమిన్ ఉంటుంది. అది వైరస్ నుంచి > కాపాడుతుంది.- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
> ఇంట్లో వండేవే తినాలి. క్రొవ్వు పదార్థాలు. నూనెల వాడకం తగ్గించాలి.
> పండ్లు, కూరగాయల్ని బాగా కడిగి తినాలి.
> వెన్న తీసిన పాలు, పెరుగు తినాలి. వాటిలో ప్రోటీన్, కాల్షియం బాగా ఉంటుంది.
> మైదా, వేపుళ్ళు, జంక్ ఫుడ్(చిప్స్, కుక్కీస్) తినవద్దు.
> కూల్ డ్రింక్స్, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు. వాటిలో పోషకాలు చాలా తక్కువ.
> వెన్న, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి.
> మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచొద్దు.
> స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువ తినాలి.
> మాంసం, లివర్, వేపిన (ఫ్రై) మాంసాన్ని తినకండి.
> వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తినండి.
> పూర్తి గుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తినండి.
కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతానికి పైగా లక్షణాలు లేకుండా లేదా చిన్న లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అలాంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదన్న ప్రభుత్వం... ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందాలని సూచించింది.
Famous Posts:
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
corona virus symptoms, coronavirus wiki, coronavirus treatment, coronavirus map, coronavirus worldometer, coronavirus india, coronavirus news, covid 19, home quarantine, corona food
Comments
Post a Comment