Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే | Food and nutrition tips during self-quarantine | Hindu Temple Guide

కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు. చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు. అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు. సరైన పద్ధతిలో పోషకాహారం తీసుకుంటే తొందరగా రికవరీ అవొచ్చు. శక్తినిచ్చే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజాలు సరిపడా తీసుకుంటేనే తొందరగా కోలుకోవచ్చు. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పాలు తీసుకోవాలి. అల్పాహారంగా రాగి మాల్ట్ మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్డు రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవడం మేలు. కరోనా బారిన పడని వారికి కోలుకున్న వారికి విటమిన్ సి ఎంతో కీలకం. 

అందుకే సిట్రస్ జాతి పండ్లు అయిన నిమ్మ ఆరెంజ్ ను కచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ సి లభించే క్యాప్సికం బ్రోకోలి క్యారెట్ పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవాలి. వేడి నీళ్లలో తేనె నిమ్మరసం వేసి తీసుకుంటే సమృద్ధిగా విటమిన్ సి లభిస్తుంది. మధ్యాహ్న భోజనంలో రొట్టె చేర్చాలి. పప్పు ఆకుకూరలు విటమిన్ సి లభించే కూరగాయలు చికెన్ చేప తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఉడికించిన పల్లీలు శనగలు వేయించిన బఠానీలు నానబెట్టిన బాదం బొబ్బర్లు అలసందలు పెసలు తీసుకోవచ్చు. ఈ పప్పు ధాన్యాలతో శక్తితో పాటు ప్రోటీన్లు ఐరన్ జింక్ వివిధ విటమిన్లు లభిస్తాయి. గుమ్మడి గింజలతో అధికంగా జింకు పొందొచ్చు. నీరసంగా ఉన్నవారు మాంసకృత్తులు అధికంగా లభించే నువ్వులను బాగా వాడాలి. నువ్వులతో చేసే పచ్చళ్లతో పాటు బెల్లంతో నువ్వుల ఉండలు చేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు. రక్తహీనతకు నువ్వులతో చెక్ పెట్టొచ్చు. ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా మేలే. ఆకుకూరల్లో పాలకూర ఎంతో ప్రయోజనకారి. విటమిన్ సి ఉండే పండ్లు కీవి బొప్పాయిని తీసుకోవాలి. ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడ్డవారు తొందరగా కోలుకోవచ్చు. వీటన్నింటికంటే కీలకమైనది సమయానికి తినడం సరిపడా నిద్ర అత్యావకశ్యం.

Related Posts:
నీటి ఆవిరితో కరోనా మాయం

కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు

> కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

corona, covid-19, corona systems, corona food, vitamin c, vitamin c food, Coronavirus 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు