కరోనా బాధితులు ఒక క్రమపద్ధతిలో రోజూ మూడుసార్లు ఆవిరి పట్టుకొంటే చాలా వరకు ప్రయోజనం ఉంటోందని వైద్యుల పరిశీలనలో తేలింది. ఇలా చేస్తూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్న వారు త్వరగా కోలుకుంటున్నట్లు హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందించే ప్రధాన వైద్యుడి పరిశీలనలో స్పష్టమైంది.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రస్తుతం 20 వేల మంది వరకు కరోనా బాధితులు ఉండగా 15 వేల మందికి పైగా ఇంట్లోనే వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్ లోని వారికి వైద్యసాయం సరిగా అందడం లేదని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, స్నేహితుల సలహాలు సూచనల ఆధారంగా కొందరు వైద్యం చేసుకుంటున్నారు. కొందరు అతిగా కషాయం తాగుతుండగా, మరికొంతమంది ఇష్టానుసారం మందులు వాడేస్తున్నారు. అప్పటికే చాలామంది ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుపడుతోందని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి మరీ విషమిస్తే న్యూమోనియాకు దారితీస్తోంది. ఇలాంటి వారికి తొలుత ఆక్సిజన్ తరువాత వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కరోనా సోకిన వారు ఆది నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడడంతోపాటు రోజూ మూడు పూటలా 15 నిమిషాలపాటు ఆవిరి పడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. పాత్రలో మరిగించిన నీటిలో ట్యూబ్ మందు గానీ పసుపు గానీ వేసి పావు గంట సేపు ఆవిరి పీల్చాలని సూచిస్తున్నారు. తద్వారా రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. శ్వాస ప్రక్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ ఫెక్షన్ తొలగిపోతుంది. ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది.
ఆవిరి పట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఊపిరితిత్తులు, రక్తనాళాల పైభాగంలో చేరిన మ్యూకస్ కొంతమేర తొలగిపోతుంది. గొంతులో ఇబ్బంది ఉన్నా ఉపశమనం లభిస్తుంది. కరోనా బాధితులు మందులు వాడుతూనే ఆవిరి పడితేనే ప్రయోజనం ఉంటుంది. రోజూ ఆవిరిపట్టినా ఉపయోగం ఉండదు.
మందులు వాడుతూ ఆవిరి పట్టిన కరోనా బాధితులు త్వరగా కోలుకుంటున్నట్లు మా పరిశీలనలో తేలింది. రోజూ మూడుసార్లు కనీసం 15 నిమిషాలకు తక్కువ కాకుండా ఆవిరిపట్టాలి. ఇలా చాలామందికి చికిత్స అందించాను. ఆక్సిజన్ శాతం చాలా మందిలో మెరుగుపడింది.
Famous Posts:
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
> నీటి ఆవిరితో కరోనా మాయం
> కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
coronavirus in india, what is coronavirus, coronavirus - wikipedia, coronavirus symptoms, coronavirus map, coronavirus italy, coronavirus worldometer,coronavirus news
Comments
Post a Comment