Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్ బాధితుల్లో హెయిర్ లాస్ | Latest News

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సోకినవారిలో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మహమ్మారి బాధితుల్లో చాలామందికి హెయిర్ లాస్ సమస్య ఎదురైందని తాజాగా అధ్యయనం పేర్కొంది. కరోనా బాధితుల్లో జుట్టు రాలడం దీర్ఘకాలిక సమస్యగా మారినట్లు పరిశోధనల్లో తేలింది. ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, కోవిడ్ 19 సర్వైవర్ గ్రూప్ కలిసి ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో జుట్టు రాలడాన్ని కరోనా వైరస్ దీర్ఘకాలిక లక్షణంగా గుర్తించారు. ఫేస్‌బుక్‌ పోల్ ద్వారా 1,500 మందికి పైగా రోగులను సర్వే చేసి డాక్టర్లు.

ఈ విషయంపై రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ నటాలీ లాంబెర్ట్ మాట్లాడుతూ.. తీవ్రమైన నరాల నొప్పి, ఏకాగ్రతను కోల్పోవడం, నిద్రపోవడంలో ఇబ్బంది, దృష్టి మసకబారడం, జుట్టు రాలడం వంటి కొత్త లక్షణాలను మేము చేసిన తాజా అధ్యయనంలో గుర్తించాం అని అన్నారు. అంతేకాకుండా సర్వే పోల్‌లో పాల్గొన్నవారిలో దాదాపు మూడో వంతు మంది జుట్టు రాలడాన్ని వైరస్ లక్షణం అని తేల్చి చెప్పారు. సైన్స్ వరల్డ్‌కు ఇంకా తెలియని ఎన్నో కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హాలీవుడ్ నటి అలైస్స మిలానో తాను కరోనా బారిన పడటం వల్ల జుట్టు ఊడిపోయిందని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇక అటు కరోనా రాకపోయినా జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంది. తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కాగా, కరోనా పేషంట్లలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.

Related Posts:
> నీటి ఆవిరితో కరోనా మాయం

కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు

> కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే

> > చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.


corona new symptoms, coronavirus symptoms day by day, coronavirus symptoms vs flu symptoms, corona symptom checker, coronavirus symptoms vs cold, coronavirus symptoms in kids, coronavirus symptoms 2020, what is coronavirus

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు