తగ్గినా బంగారం ధర ఈరోజు రేట్లు ఇలా పడిపోయిన వెండి| Today Gold Rate: 22 & 24 Carat Gold Price in India
బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ పసిడి దిగిరావడం గమనార్హం. పసిడి ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,720కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.510 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,240కు పడిపోయింది.
పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పైకి కదిలింది. దీంతో ధర రూ.66,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 2.09 శాతం పెరుగుదలతో 1973 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 2.11 శాతం పెరుగుదలతో 27.59 డాలర్లకు చేరింది.
ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Famous Posts:
> యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
> 100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన
> 50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి
gold rate today, gold rate today in vijayawada, gold rate today in india, gold rate today in hyderabad, gold rate today 22k, gold rate today in chennai, gold rate today 22 carat, 22ct gold price today, silver rate today
Comments
Post a Comment