Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమాచారం అధిక ఆశ్వయుజ మాసం - 2020 | Tirumala Brahmotsavam Information-2020

 


 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాచారం :

ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనగానే లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. కానీ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరొన వైరస్ కారణంగా భారీ ఎత్తున నిర్వహించే అవకాశం లేదు. కేవలం అతి తక్కువ సంఖ్యలో భక్తులని అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించినది. కానీ ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అందుకు గల కారణం ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడమే కారణం.  

సెప్టెంబర్ 18న అంకురార్పణతో మొద‌లైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌ర్ 27న చ‌క్రస్నానంతో ముగియ‌నున్నాయి.   అక్టోబర్ 16న నిజ ఆశ్వయుజ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే నెల‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భ‌క్తులు పెరిగే అవ‌కాశం ఉన్నందున క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయ‌నున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 

కరొన వైరస్ వల్ల తిరుమల లో కేవలం 8 వేల మందికి మాత్రమే దర్శనం లభిస్తుంది. అది కూడా కోవిడ్ లేదు అని వైద్య పరీక్ష సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే దర్శనానికి అనుమతి లభిస్తుంది. కావున ఈ నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్యలోనే భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణయించింది.  ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాస శ్రీవారి బ్రహ్మోత్సవాల  వివరాలు ఈ కింద వివరించడం జరిగినది. 

ఈ ఏడాది 19న శనివారం ఉదయం ధ్వజారోహణం,  రాత్రి పెద్దశేషవాహనం ఊరేరిగింపు   

20న ఆదివారం ఉదయం చిన్నశేష వాహనం , రాత్రి హంస వాహనం ఊరేరిగింపు

21న సోమవారం ఉదయం సింహా వాహనం , రాత్రి ముత్యపు పందిరి ఊరేరిగింపు

22న మంగళవారం ఉదయం కల్ప వృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం ఊరేరిగింపు

23న బుధవారం ఉదయం మోహినీ అవతారం , రాత్రి గరుడ వాహనం ఊరేరిగింపు

24న గురువారం ఉదయం హనుమంత వాహనం, స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం ఊరేరిగింపు

25న శుక్రవారం ఉదయం  సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం ఊరేరిగింపు

26న శనివారం ఉదయం రథోత్సవం , రాత్రి అశ్వ వాహనం ఊరేరిగింపు

27న ఆదివారం ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి చక్రస్నానం ధ్వజ అవరోహణం. 


తిరుమాడ విధులలో ఊరేరిగింపు లేవు కేవలం అంతరాలయ లోనే పూజలు నిర్వహిస్తారు. 

చక్రస్నానం కూడా కేవలం ఆలయ అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. 

Related Postings :


key words : Tirumala Brahmotsavam Information-2020, Tirumala Brahmotsavam, tirumala, ttd latest Inforation, Tirumala , Tirupati , Hindu Temples Guide.


Comments