దేశానికి పట్టెడన్నం పెట్టన్నం పెట్టే రైతన్న కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న మోదీ సర్కార్ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. పల్లెల్లో యువ రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేసింది. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు ద్వారా ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తోంది. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఆ భారాన్ని కేంద్రం భరించాలని నిర్ణయించింది.
అందులో 75 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సుమారు రూ.3.75 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. మిగిలిన డబ్బులు రైతన్నలు పెట్టుకోవాలని సూచించింది. టెస్ట్ మెషీన్లు, కెమికల్స్ ఇతర అవసరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, జీపీఎస్ వంటి వాటికి రూ.లక్ష అవుతుంది. నేల నమూనాను తీసుకొని దాన్ని పరీక్షించి సాయిల్ హెల్త్ కార్డు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో శాంపిల్‌కు రూ.300 అందిస్తుంది.
సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావించే వారు డిస్ట్రిక్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ లేదా వారి ఆఫీస్‌కు వెళ్లి సంప్రదించాలని సూచించింది. agricoop.nic.in లేదా soilhealth.dac.gov.in వెబ్‌సైట్ల ద్వారా కూడా సమాచారం పొందాలని సూచించింది. ఇది కూడా కాకపోతే కిసాన్ కాల్ సెంటర్‌కు (1800 180 1551) కాల్ చేయొచ్చు. రైతులు వారి గ్రామాల్లోనే వారి భూసార పరీక్షలు నిర్వహించుకునేలా చేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించడం అనే లక్ష్యాలతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌కు ఆర్థిక మద్దతు అందిస్తోంది.
18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. రైతులు మాత్రమే కాకుండా స్వయం సహాయక గ్రూపులు, ఫార్మర్స్ కోఆపరేటివ్ సోసైటీస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటి వారు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను రెండు రకాలు ఏర్పాటు చేయోచ్చు. ఒక షాప్‌ను అద్దెకు తీసుకొని అందులో ల్యాబ్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వ్యాన్ తీసుకొని అందులోనే ల్యాబ్ ప్రారంభించొచ్చు.
ప్రస్తుతం దేశంలో 7949 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా వాటి సంఖ్య మరింత పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10,845 ల్యాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 82 గ్రామాలకు కలిపి ఒక ల్యాబ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం 2 లక్షల ల్యాబ్స్ అవసరం అవుతాయి. దాంతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయం అందించనుంది. ఇంకెందుకు ఆలస్యం ల్యాబ్ ప్రారంభించాలనుకునే రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Related Posts:
> యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
> 100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన
> 50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి
> దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 లక్షలు ఇస్తారు..
3 lakh loan for farmers without interest, pm-kisan schemepm-kisan scheme, pm kisan scheme, apply online, pm kisan registration, pm kisan list, modi loan scheme 2020, modi scheme 2020
Comments
Post a Comment