నా పేరు ముందు అవి వాడకండి: బాలు స్వహస్తాలతో రాసిన లేఖ
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ క్షేమంగా బయటికి రాలేకపోయారు. ఆయన శుక్రవారం మథ్యాహ్నం మృతి చెందినట్లుగా అధికారికంగా తెలియజేశారు. ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిది. సంగీతం ప్రపంచం అంతా చింతిస్తోంది. సంగీత ప్రియులను శోక సంద్రంలో ముంచి బాలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన క్షేమంగా వస్తారని ఎందరో, ఎన్నో ప్రార్థనలు చేశారు. అవి ఏవీ ఫలించలేదు. ఒక శకం ముగిసినట్లుగా సినిమా ఇండస్ట్రీస్ తల్లడిల్లిపోతున్నాయి. ఇక ఆయన జ్జాపకాలను అంతా నెమరు వేసుకుంటున్నారు.
తాజాగా ఆయన స్వహస్తాలతో రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆయన ఓ కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు 'డాక్టర్', 'పద్మభూషణ్, 'గానగంధర్వ' వంటి విశేషణలు వేయకండి.. అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (జ. 1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన 1946, జూన్ 4 న తిరువళ్ళూరు జిల్లాలో కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు.
Famous Posts:
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
> కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
> కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
S. P. Balasubrahmanyam, SP BALU, ఎస్పీ బాలు, sp balu songs, sp balasubrahmanyam died, s.p. balu telugu solo songs list, sp balasubrahmanyam son
Comments
Post a Comment