మన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అని చెప్పడానికి చింతిస్తున్నాము . బాలు గారి జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము . తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారూ . అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. బాలు గారు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో 1946 జూన్ 4 న ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు . తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు . చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు .
బాలు గారి సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు . 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు
RELATED POSTINGS :
SP BALA SUBRAHMANAYM , SRI CHAGANTI, SP BALA SUBRAHMAYANAM LIFE ,
Comments
Post a Comment