మహిమగల సొరకాయలట... ఇంట్లో పెట్టుకుంటే కుబేరులేనట
మనుషుల నమ్మకాలే పెట్టుబడిగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తుంటారు కొందరు కేటుగాళ్లు. మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకుని క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతూ విచిత్రమైన విషయాలను భక్తులకు చెబుతూ మోసం చేస్తుంటారు. ఇలా ఓ ముఠా ఆంధ్రప్రదేశ్‌లో ‘మాయ సొరకాయల’ పేరిట భక్తులను మోసం చేశారు. చివరకు మోసపోయామని గ్రహించిన జనాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఈ ముఠా గుట్టు రట్టయింది.
Also Read : ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఇటీవల ఓ ముఠా హల్‌చల్ చేసింది. అక్కడ ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న సొరకాయలను అమ్మసాగారు. ఈ సొరకాయలు మామూలువి కాదని, వాటిలో చాలా శక్తులు ఉన్నాయని భక్తులకు చెప్పారు. ఈ సొరకాయలు నల్లమల్ల అడవుల్లో మాత్రమే పండుతాయని, వీటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుందని నమ్మించారు. ఇలా వారి మాటలను నమ్మిన కొందరు రూ. లక్షలు చెల్లించి ఆ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొందరైతే ఒక్కో సొరకాయకు రూ. కోటి నుంచి రూ. 2 కోట్లు కూడా చెల్లించినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర వెల్లడించారు.
Also Read : మరణం తరువాత ఏం జరుగుతుంది?
ఈ కేసుకు సంబంధించి మొత్తం 21 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారని, శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశ్రమంతో వీరికి లింక్‌లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం నడుపుతున్న వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరందరిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు నాగేంద్ర వివరించారు. కాగా, ఈ సొరకాయలు పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అని పిలుస్తుంటారు.
Famous Posts:
> వగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?
> భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.
> తులసి_చెట్టు మారే స్థితిని బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే చెప్పవచ్చట
> చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?
> ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
> పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...
> శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం
bottle gourd, round gourd, srisailam sorakaya, Naga Sorakaya,సొరకాయ, news, telangana,
Comments
Post a Comment