Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నవంబర్ 20 నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం | Tungabhadra Pushkaralu To Begin From 20th November | Tungabhadra Pushkaralu in AP 2020

 
ఈ నెల నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానుండగా, కరోనా నేపథ్యంలో ఈ పుష్కరాల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది . స్లాట్ బుక్ చేసుకున్న వారికే అనుమతి ఇవ్వనుండగా tungabhadrapushkaralu2020.ap.gov.in ఈ వెబ్ సైట్ లో ఘాట్లు వివరాలు ఉండనుండగా ఒక్కో టికెట్ పై ఇద్దరు భక్తులకు అనుమతి ఉంటుంది .

పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.

 తుంగభద్రమ్మ నడక ఇలా….

కర్నాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువుదీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. కౌతాళం, కొసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగళ్, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతంఉంది.

పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?

ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.

ప్రత్యేకత గల ఆలయాలు

కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట, అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ, దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది. నాగులదిన్నె సమీపంలో సాయిబాబా దేవాలయం ఉంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు. సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి.

Famous Posts:

నిత్య దరిద్ర కారణాలు ఇవే..

రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..? 

మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా? 

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..

శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..? 

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి  ? 

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు 

tungabhadra pushkaralu places, tungabhadra pushkaralu 2020 in ap, tungabhadra pushkaralu online booking, e pass for tungabhadra pushkaralu, tungabhadra pushkaralu ghats, tungabhadra pushkaralu 2020 in telugu, tungabhadra pushkaralu in ap, tungabhadra pushkaralu ghats in andhra pradesh, tungabhadra pushkaralu slot booking ap, తుంగభద్ర పుష్కరాలు

Comments