నేడు ఆకాశంలో అద్భుతం..400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం | The Great Conjunction Of Jupiter And Saturn On December 21
నేడు ఆకాశంలో అద్భుతం జరగనుంది.
నేడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు పరస్పర దగ్గర కానున్నాయి. కొన్ని గంటల పాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండు 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికొకటి అతి సమీపంగా వస్తాయంటున్నారు. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పటికీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల అవి కనిపించలేదని చెబుతున్నారు. అయితే సోమవారం నాటి గ్రహాల కలయికను నేరుగా చూసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరార్ధగోళంలో జరిగే గ్రహ సముచ్చయాన్ని స్టార్ ఆఫ్ బెత్లెహేమ్‌గా అభివర్ణిస్తారన్నారు.
Also Read : వాటి సైజును బట్టి ఆడవాళ్లు ఎలాంటి వాళ్లో ఇట్టే చెప్పేస్తారు
ఇది మళ్లీ 2080 మార్చి 15న ఉంటుందని పేర్కొంటున్నారు.
మిగతా గ్రహాలకు భిన్నంగా శని కలయిక చాలా అరుదు. సౌర కుటుంబంలోనే అతి పెద్దదైన గురు గ్రహం సూర్యునినుంచి ఐదవది. రెండో అతిపెద్ద గ్రహమైన శని..సూర్యునినుంచి ఆరోది. సూర్యుని చుట్టుూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకోసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటిది సోమవారం ఆవిష్కృతం కానున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది సంయోగం చివరి సారిగా 1623లో కనిపించినట్లు చెప్పారు.
తాజాగా రెండు గ్రహాలు పరస్పర దగ్గరగా వచ్చినట్లు కనిపించినప్పటికీ, ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. ముందుభాగంలో ఉండే గురు గ్రహం.. అప్పుడు భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు.
భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను మామూలు కంటితో చూడొచ్చు. సోమవారం సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించొచ్చు. గురు గ్రహం ఒకింత పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది. దానికి ఎడమ భాగంలో.. కొంచెం పైన శని ఒకింత మసకగా కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా, విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్‌ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురు గ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయి.
Famous Posts:
> శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
> అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..?
> అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు
> గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే
> దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు
> ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?
> చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?
jupiter-saturn conjunction astrology, the great conjunction curse, jupiter saturn, conjunction in different houses, december 21, 2020 great conjunction, mars, jupiter, saturn conjunction 2020, saturn jupiter conjunction in capricorn, moon, mars, jupiter,, saturn conjunction 2020, jupiter and saturn astrology.
Comments
Post a Comment