Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వార్షిక రాశి ఫలాలు 2021 - Horoscope 2021 - Rasi Phalalu 2021 | Rasi Phalalu 2021 to 2022


రాశి ఫలాలు 2021 కొత్త సంవత్సరం 2021 లో పన్నెండు రాశిచక్ర గుర్తుల స్థానికుల కోసం ఎదురుచూస్తున్న అనేక అవకాశాలు, అవకాశాలు మరియు సవాళ్లను ఊహించింది. మీకు అపారమైన కీర్తి మరియు విజయం లభిస్తుందా లేదా మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? 2021 జాతకం అంచనాలు ఇవన్నీ వెల్లడిస్తున్నాయి! వేద జ్యోతిషశాస్త్ర సూత్రాల ఆధారంగా, వ్యాపారం, ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, విద్య మరియు కుటుంబ జీవితం పరంగా మీ రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు.
మేషరాశి
అశ్వని 4పాదములు ; భరణి 4 పాదములు ; కృతిక 1వ పాదము

ఆదాయం :-8, వ్యయం :- 14, రాజపూజ్యం :- 4, అవమానం :- 3

రాశి ఫలాలు 2021 ప్రకారము, చాలా విషయాల్లో మరియు సందర్భాలలో మీకు ఈ సంవత్సరం ప్రత్యేకముగా ఉంటుంది. ముఖ్యముగా వృత్తిపరంగా మీకు అత్యంత అనుకూలముగా ఉంటుంది. శనియొక్క అనుకూలతను మరియు ఆయన అనుగ్రమును పొందుతారు.అయినప్పటికీ, మీయొక్క ఖర్చులు పెరుగుతాయి. 2021 విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. అయినప్పటికీ, విద్యార్థులు సంవత్సరం చివర్లో పరీక్షల్లో ఉతీర్ణత సాధిస్తారు. అంతేకాకుండా, గురుయొక్క అనుకూల ప్రభావంవలన, ఉన్నత చదువులకొరకు విదేశాలు వెళ్ళాలి అనుకునేవారి కోర్కెలు నెరవేరుతాయి. కుటుంబజీవితము మాత్రము అంత అనుకూలముగా ఉండదు.మీరు ఆశించినంత సహకారమును కుటుంబం నుండి పొందలేరు. మీ తండ్రిగారి ఆరోగ్యము క్షీనిస్తుంది. వైవాహిక జీవితములో అనేక పరిస్థితులను ఎదురుకొనవలసి ఉంటుంది. వృత్తిపరంగా మీకు 2021 అనుకూలముగా ఉంటుంది. మీకు మరియు మీ జీవితభాగస్వామికి మధ్య అవగాహన రాహిత్యము ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ప్రేమలో ఉండి, వారియొక్క ప్రియమైనవారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, వారు శుభవార్తలు అందుకుంటారు మరియు సంతోషముగా ఉంటారు.
మేషరాశి ఫలాలు : పరిహారములు
పగడమును ధరించండి.

ప్రతి మంగళవారం మరియు శనివారం సుందరాకండ పారాయణము చేయండి మరియు ప్రతిరోజు భాజరంగబాన్ పఠించండి.

ఒకటి లేదా రెండు జ్యోతిర్లింగాలను దర్శించండి.

2021 సంవత్సరములో ఒక్కసారి రుద్రాభిషేకము చేయించుకోండి.

రాగి పాత్రను ఉపయోగించి సూర్యునికి ప్రతిరోజూ అర్గ్యము అందించండి.


వృషభరాశి
కృత్తి 2,3,4, పా రోహిణి. 4 పాదములు మృగ 1,2 పా

ఆదాయం :-2, వ్యయం :- 8, రాజపూజ్యం :- 7, అవమానం :- 3

2021 రాశి ఫలాలు ప్రకారము, వృషభరాశి వారికి ఊహించని మార్పులు చోటు చేశుకుంటాయి. వృత్తిపరంగా అనుకూలముగా ఉంటుంది. మీరు కూరుకున్న విధముగా మీకు స్దానచలనములు లభించే అవకాశమున్నది. అంతేకాకుండా, మీరు ఒకవేళ ఉద్యోగము మారవలసివస్తే, ఈసమయములో మీరు నూరుశాతాము విజయాన్ని అందుకుంటారు. 2021 ప్రకారము, ఆర్ధిక పరముగా మీకు ఈసంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. మీకు జనవరి నుండి ఏప్రిల్ 14వరకు, మే చివరివారం నుండి జులై వరకు తరువాత సెప్టెంబర్ మీకు ఆర్ధికంగా అనుకూలముగా ఉంటుంది. ఈ 2021లో మీరు అనేక ఆర్ధిక ఒడిదుడుకులను ఎదురుకొనవలసి ఉంటుంది. చదువులపట్ల మరింత శ్రద్ద చూపవలసి ఉంటుంది. కుటుంబ విషయానికివస్తే, అనుకూలముగా ఉండదు. వైవాహిక ,మరియు ప్రేమలోఉన్నవారికి అనుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈసంవత్సరం మీరు మీయొక్క ఆరోగ్యముపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.లేనిచో, అనారోగ్య సమస్యలు తప్పవు. యోగ మరియు ధ్యానము చేయుట మంచిది.

వృషభరాశి ఫలాలు : పరిహారము
ఉత్తమ నాణ్యతగల డైమండ్ లేదా ఒపాల్ రత్నం ధరించండి.

ప్రతిరోజూ చిన్నారి ఆడపిల్లల పాదాలు తాకి వారియొక్క ఆశీర్వాదం తీసుకోండి మరియు వారికి తెల్లటి తీపి పదార్థములను అందించండి.

శుక్రవారం చీమలకు పిండి తినిపించండి.అలాగే, ఎండిన తురిమిన కొబ్బరి,పిండి మరియు చక్కెర కలిపిన పొడి కొబ్బరికాయలో నింపి,ఆపై ఎవరు తిరగని ప్రదేశంలో పాతిపెట్టండి.

మీ సేవలను ఒక ఆవుకు నిరంతరం అందించండి మరియు ప్రతిరోజూ మీ స్వంత భోజనం నుండి ఆమెకు ఆహారాన్ని అందించండి.

మీ ఇంటి మహిళలతో బాగా మర్యాదగా ప్రవర్తించండి మరియు సమాజంలో మహిళల అభ్యున్నతిలో ఒక భాగంగా ఉండండి.

మిధునరాశి 
మృగ 3,4 పా, ఆర్ద్ర 1,2,3,4 పా, పున 1,2,3 పా 

ఆదాయం :-5, వ్యయం :- 5, రాజపూజ్యం :- 3, అవమానం :- 6

2021 రాశి ఫలాలు ప్రకారము, మిథునరాశి వారికి చదువుల విషయములో అనేక అవకాశములు, ఆకాంక్షలు కలుగుతాయి. జనవరి నుండి మే 2021వరకు విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది.విదేశాలలో ఎవరైతే ఉన్నతవిద్యను అభ్యశించాలి అనుకుంటారో, వారు విజయాలను అందుకుంటారు.వివాహ విషయములో శుభవార్తలు వింటారు.అయినప్పటికీ, 2021లో ఆరోగ్యముపట్ల మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్ములను ఇబ్బందులకు గురిచేయవచ్చును. మీయొక్క ఖర్చులు పెరుగుతాయి. కానీ, మీరు ఇతర మార్గాలనుండి లాభాలను పొందుతారు.

మొత్తముగా చూసుకుంటే , కొన్ని నెలలు మీకు ఆర్ధికంగా, అనుకూలముగా ఉంటుంది. కొన్నినెలలు ఒత్తిడికర పరిస్థితులను ఎదురుకొనవలసి ఉంటుంది. వ్యాపారములోఉన్నవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. మీ వ్యాపారభాగస్వామి మీయొక్క నమ్మకమును అలుసుగా తీసుకుని మీకు ఇబ్బందులు కలిగించే అవకాశమున్నది. ఆరోగ్యపరముగా మీకు అనుకూలముగా ఉండదు.ముఖ్యముగా మీయొక్క ఆహారపు అలవాట్లపట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి.లేనిచో, రక్త సంబంధిత మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు మిమ్ములను ఇబ్బందులకు గురిచేస్తాయి.

మిథున రాశి ఫలాలు 2021: పరిహారము
బుధవారం ఒక జత పక్షులను విడిపించండి.

అధిక నాణ్యత గల పచ్చ రత్నం ధరించండి.

ఆకుపచ్చ రంగు గాజులు లేదా బట్టలను మీ పితృ లేదా తల్లిగారి బంధువులకుకు బుధవారం బహుమతిగా ఇవ్వండి.

బుద బీజ మంత్రాన్ని “ఓం బ్రాం బ్రీం సః బుధయ నమః అని 108 సార్లు క్రమం తప్పకుండా జపించండి.


కర్కాటక రాశి 
పునర్వసు 4వ పా, పుష్యమి 1,2,3,4 పా ఆశ్రేష 4 పాదములు

ఆదాయం :-14, వ్యయం :- 2, రాజపూజ్యం :- 6, అవమానం :- 6

2021 రాశి ఫలాలు ప్రకారము, మీయొక్క జీవితములోని వివిధ సందర్భములలో, అనేక ముఖ్యమార్పులు చోటు చేసుకుంటాయి . వృత్తిపరంగా, మీరు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. లేనిచో, మీరు అనేక సమస్యలను ఎదురుకొనవలసి ఉంటుంది. అదృష్టము కూడా కలిసిరాదు. కార్యాలయాల్లో, మీయొక్క ఉన్నతాధికారులతో మీయొక్క తప్పులవలన మీకు వారికి వివాదాలు చెలరేగే అవకాశమున్నది. ఆర్ధిక పరముగా మాత్రము అనుకూలముగా ఉంటుంది. ప్రభుత్వమునుండి మీరు ఆర్ధిక ప్రయోజనములు పొందవచ్చును. మీయొక్క పాత బకాయిలను మీరు పూర్తి చేస్తారు. మొత్తముగా చూసుకుంటే అనుకూలముగా ఉంటుంది. ఎవరైతే ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారో, వారికి ఏప్రిల్ వరకు తరువాత సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలముగా ఉంటుంది. వారు కోరుకున్న ఫలితాలను పొందుతారు.ఆరోగ్యపరంగా అనుకూలముగా ఉండదు. కావున జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన.

కర్కాటక రాశి ఫలాలు 2021: పరిహారము
వెండి ఉంగరంలో మంచి నాణ్యత గల ముత్యాన్ని ధరించండి.

బజరంగ్ బాన్ పఠించండి మరియు శ్రీ గణపతి అధర్వశిర్షను పఠించడం మంచిది.

బృహస్పతితో సంబంధం ఉన్న బీజమంత్రాన్ని జపించడం మీకు అనుకూలంగా ఉంటుంది.

సోమవారం ఒక శివుని ఆలయాన్ని సందర్శించి అతనికి అక్షింతలు అర్పించండి.

మంగళవారం దేవాలయాలను సందర్శించండి మరియు ఎరుపు రంగు జెండాను ఎగురవేయండి.


సింహరాశి 
మఘ 1,2,3,4 పా, పుబ్బ 1,2,3,4 పా, ఉత్తర 1వ పా

ఆదాయం :-2, వ్యయం :- 11, రాజపూజ్యం :- 2, అవమానం :- 2

2021 రాశి ఫలాలు ప్రకారము, ఈ సంవత్సరము మీరు అనేక ఒడిదుడుకులను ఎదురుకొనవలసి ఉంటుంది. వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలముగా ఉంటాయి. అంతేకాకుండా, కార్యాలయాల్లో ఆకస్మిక ప్రమోషన్లు సంభవించే అవకాశముంది. ఏప్రిల్ నుండి మేనెలవరకు కొన్ని పరీక్షలను ఎదురుకొనవలసి ఉంటుంది. మీకు మరియు మీయొక్క ఉన్నతాధికారులకు మధ్యఉన్న సంబంధములు దెబ్బతినే అవకాశమున్నది. ఆర్ధికంగా, 2021లో మీరు ఊహించని కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది. కానీ మీరు ప్రణాళికాబద్దముగా నిర్వహించినట్లైతే మీరు విజయాలను అందుకుంటారు.ఆగష్టునుండి అక్టోబర్ వరకు ఆర్ధిక ప్రయోజనములు పొందుతారు. విద్యార్థులకు మాత్రము మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నవి. ఆరోగ్య పరముగా జాగ్రత్త అవసరము. చెయ్యి, హృదయ, కిడ్నీ సంబంధిత సమస్యలతో, భాదపడే అవకాశము ఎక్కువగా ఉన్నది.కావున జాగ్రత్త అవసరము.

సింహరాశి ఫలాలు 2021: పరిహారము
ఆదివారం రాగి ఉంగరంతో మంచి నాణ్యమైన కెంపు రాయిని ధరించడం మంచిది.

గోధుమ పిండి కలిపి ఎద్దులకు ఆహారం ఇవ్వండి.

మీ తండ్రిని గౌరవించండి మరియు మీ సేవలను అతనికి అందించండి.

ఆవ నూనెలో మీ నీడను చూసి శనివారం దానం చేయండి.

గురువారాల్లో ఉపవాసాలు పాటించడం మరియు రావిచెట్టు తాకకుండా నీటిని అందించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్యారాశి
ఉత్త 2,3,4 పా, హస్త 1,2,3,4 పా, చిత్త 1,2పా 

ఆదాయం :-5, వ్యయం :- 5, రాజపూజ్యం :- 5, అవమానం :- 2

2021 రాశి ఫలాలు ప్రకారము, కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. సంవత్సర ప్రారంభము మీకు అనుకూలముగా ఉంటుంది. మధ్యలో మీరుకొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వృత్తి పరముగా మీకు సాధారణముగా ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో మీరు మీయొక్క ఉద్యోగమును వదలి కొత్త ఉద్యోగంలో చేరుతారు.జనవరి, మార్చ్, మేనెలల్లో మీకు మంచి ఫలితాలు అందుతాయి. కానీ, ఆర్ధికపరముగా మీరుకొన్ని ఇబ్బందులను ఎదురుకొనవలసి ఉంటుంది.విద్యార్థులకు సమయము కఠినముగా ఉంటుంది. కష్టపడి చదవటంవలన మాత్రమే మీరు విజయాలను అందుకోగలరు. కుటుంబ జీవితము మీకు అనుకూలంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. కానీ, కొంతమంది దియాబెటిస్ మరియు మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడతారు. కావున శుభ్రమైన ఆహారమును మరియు నీటిని తీసుకొనుట చెప్పదగిన సూచన.

కన్యారాశి ఫలాలు 2021: పరిహారం
బుధవారం మీ చిన్న వేలుకి బంగారు ఉంగరంలో ఉత్తమ నాణ్యత గల పచ్చ రత్నాన్ని ధరించడం మీకు అనుకూలంగా ఉంటుంది.

మంగళవారం కొన్ని పెసర్లు నానబెట్టి,ఆవుకు బుధవారం మీ చేతులతో తినిపించండి.

ప్రతిరోజూ దుర్గాచలిసాను పఠించడం మీకు అనుకూలంగా ఉంటుంది.

దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి మందార లేదా గులాబీల వంటి ఎర్రటి పువ్వులను అర్పించండి.

మీ పర్స్ లేదా జేబులో ధృఢమైన చదరపు ముక్క వెండిని ఎల్లప్పుడూ ఉంచండి.


తులారాశి 
చిత్త 3,4 పా, స్వాతి 1,2,3,4 పా, విశా 1,2,3 పా 

ఆదాయం :-2, వ్యయం :- 8, రాజపూజ్యం :- 1, అవమానం :- 5

2021 రాశి ఫలాలు ప్రకారము, మీయొక్క జీవితము ఈ 2021లో అనేక ఎత్తుపల్లాలను చూస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉంటుంది. వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారము చేయడానికి ఆలోచిస్తే అవి మంచి ఫలితములు ఇవ్వవుఅని గుర్తుంచుకోవాలి. 2021 ప్రారంభంలో, ఆర్ధికపరముగా మీకుఅనుకూలముగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది.పరిస్థితులు వారికి అనుకూలముగా ఉంటాయి.

కుటుంబ జీవిత విషయానికివస్తే, 2021 చాలా సాధారణముగా ఉంటుంది. మీరుఇంటికి దూరముగా వెళ్ళవలసి రావచ్చును. కుటుంబ వివాదాల నేపధ్యములో దూరముగా ఉండరు.కేవలము మీయొక్క పనిఒత్తిడి మరియు స్దానచలనమువలన కుటుంబానికి దూరముగా ఉండవలసి ఉంటుంది.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తప్పించుకొనుటకు మీరు మీయొక్క ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకొనవలెయును. సమతుల్య మరియు నాణ్యమైన ఆహారమును అనగా పండ్లు, కూరగాయలను మీయొక్క ఆహారపు అలవాట్లలో చేర్చండి.

తులారాశి ఫలాలు 2021: పరిహారము
మీ రాశిచక్రం యొక్క పాలక శక్తిని బలోపేతం చేయడానికి, శుక్రవారం మీ ఉంగరపు వేలుకి వెండి ఉంగరంలో డైమండ్ లేదా ఒపాల్ రత్నాన్ని ధరించాలి.

గోమాతకు వీలైనంత వరకు సేవ చేయండి మరియు ఆమెకు పిండిని తినిపించండి మరియు ఆమెను మూడుసార్లు వెనుక తాకండి.

ఇది కాకుండా, శనివారం మధ్య వేలుపై పంచధాతు లేదా అష్టాధాటు ఉంగరంలో నీలమణి రత్నం ధరించడం కూడా 

మీకు లాభదాయకమైన ఒప్పందమని రుజువు చేస్తుంది మరియు వృత్తిపరమైన విజయం లభిస్తుంది.

బుధవారం ఒక జత పక్షులను విడిపించడం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది.


వృశ్చికరాశి
విశా 4వ పా అనూ 1,2,3,4పా, జ్యేష్ఠ 1,2,3,4 పా

ఆదాయం :-8, వ్యయం :- 14, రాజపూజ్యం :- 4, అవమానం :- 5

2021 రాశి ఫలాలు ప్రకారము, వృశ్చికరాశి వారికి, మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నవి. వృశ్చికరాశివారు ఈసంవత్సరం విదేశీ ప్రయాణములు చేయవలసి ఉంటుంది.వృత్తిపరంగా మీరు పరీక్షలను ఎదురుకొనవలసి ఉంటుంది. అందువలన ఏమైనా పనులు ప్రారంభించేటప్పుడు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలు పెట్టండి.లేనిచో, ఇది మీయొక్క వృత్తిపై ప్రతికూల ప్రభావమును చూపెడుతుంది. ఆర్ధికపరముగా అనుకూలముగా ఉంటుంది. ప్రారంభములో కొన్ని ఖర్చులు చేసినప్పటికీ, మీరువాటిని తిరిగి చెల్లిస్తారు. వివాదాల్లో మీరు విజయాలనుఅందుకుంటారు. ఆరోగ్యపరముగా మీరు జాగ్రత్త వహించుట చెప్పదగిన సూచన. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మిమ్ములను తరచుగా ఇబ్బందులకు గురిచేస్తాయి.

వృశ్చికరాశి ఫలాలు 2021: పరిహారము
అత్యధిక నాణ్యత కలిగిన పగడపు రత్నం ధరించడం అనుకూలంగా అనిపిస్తుంది.

మీరు కోరుకుంటే, మీరు వెండి అర్ధ చంద్రునితో ముత్యాన్ని కూడా ధరించవచ్చు.

రోజూ నుదుటిపై కుంకుమ పువ్వు లేదా పసుపు తిలక్ పూయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ ఇంట్లో రుద్రభిషేక పూజ నిర్వహించండి.

రాగి పాత్ర నుండి ప్రతిరోజూ సూర్యునికి నీరు ఇవ్వడం ద్వారా వృత్తికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది.


ధనస్సురాశి 
మూల 1,2,3,4 పా, పూ.షాఢ 1,2,3,4 పా  ఉ.షాఢ 1వ పా

ఆదాయం :-11, వ్యయం :- 5, రాజపూజ్యం :- 7, అవమానం :- 5

2021 రాశి ఫలాలు ప్రకారము, ధనుస్సురాశి వారికి మంచి ఫలితములు గోచరిస్తున్నవి. అన్నింటా మీరు మంచి ఫలితములను అందుకుంటారు. వృత్తిపరంగా, మీరు మీయొక్క ఉన్నతాధికారుల సహాయ సహకారములు అందుకొనుట మాత్రమే కాదు, వారు మీరు జీవితములో ముందుకు వెళ్ళుటకు కూడా మీకు సహాయ సహకారములు అందిస్తారు. ఆర్ధిక పరముగా కూడా, అనుకూలముగా ఉంటుంది. సంవత్సరం మొత్తము ధనమునకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది. జనవరి, ఏప్రిల్, మే మరియు సెప్టెంబర్ నెలలు ఉన్నతవిద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యము అనుకూలముగా ఉన్నపటికీ, చిన్నచిన్న సమస్యలు తలెత్తే అవకాశమున్నది. అయినప్పటికీ ఇవి అంత ఇబ్బందులకు గురిచేసేవి కావు.

ధనుస్సురాశి ఫలాలు 2021: పరిహారము
గురువారం 12:00 నుండి 1:30 మధ్య చూపుడు వేలులో బంగారు ఉంగరంలో చెక్కబడిన అత్యున్నత నాణ్యత గల 
పుష్యరాగ రత్నాన్ని ధరించడం మీకు అనుకూలంగా ఉంటుంది.

ప్రతి గురువారం మరియు శనివారం, పీపాల్ చెట్టును తాకకుండా నీటిని అర్పించి, దానిని పూజించండి మరియు 
ప్రయోజనకరమైన ఫలితాల కోసం గురువారం అరటి చెట్టును పూజించండి.

మీకు కావాలంటే, ఆదివారం ఉదయం 8:00 గంటలకు ముందు ఉంగరపు వేలుపై రాగి ఉంగరంలో చెక్కబడిన మానిక్య లేదా కేంపు రత్నాన్ని కూడా ధరించవచ్చు.

మంగళవారం మూడు ముఖి రుద్రాక్ష ధరించడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

శనివారం, మీరు మినుములు ఆహార పదార్థములు చేసి పేదల మధ్య పంపిణీ చేయడం మంచిది.

మకరరాశి 
ఉ.షాఢ 2,3,4 పా శ్రవ 1,2,3,4 పా ధని 1,2 పా

ఆదాయం :-14, వ్యయం :- 14, రాజపూజ్యం :- 3, అవమానం :- 1

2021 రాశి ఫలాలు ప్రకారము, 2021లో మకర రాశివారికి అన్నివిభాగాలలో మీరు అనుకూలతను పొందగలరు. వృత్తిపరంగా, మీయొక్క పనితీరువల్ల మంచి ఫలితములను పొందగలరు. మీరు ఎంత కష్టపడితే అంతమంచి ఫలితములు మీరు పొందవచ్చును.ఆర్ధికపరముగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదురుకుంటారు. మీయొక్క ఖర్చులు పెరుగుతాయి. కావున, వాటిపై నియంత్రణ అవసరము.విద్యార్థులకు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యపరముగా మీరు మంచి ఫలితములు పొందుతారు.దీర్ఘకాలీక వ్యాధులనుండి మీరుఉపసమానమును పొందుతారు. మీప్రియమైనవారు మీప్రేమలో పడతారు. మిమ్ములను వివాహము చేసుకోవాలి అనుకుంటారు. కానీ, మార్చ్.మరియు జులైనుండి ఆగష్టువరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదురుకొనవలసి ఉంటుంది. మీప్రియమైన వారితో మాట్లాడి వాటిని పరిష్కరించుకొనుట మంచిది.

మకరరాశి ఫలాలు 2021: పరిహారము
శనివారం మధ్య వేలుపై పంచధాతు లేదా అష్టాధాతు ఉంగరములో అత్యుత్తమ నాణ్యత గల నీలం రత్నాన్ని ధరించడం మంచిది.

మీకు కావాలంటే, మీరు శుక్రవారం ఉంగరపు వేలుపై వెండి ఉంగరంలో ఒపాల్ రత్నాన్ని కూడా ధరించవచ్చు.

ప్రతి శుక్రవారం చిన్నారుల పాదాలను తాకి, తెల్లటి స్వీట్లు ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదం పొందడం మంచిది.

మంగళవారం రక్తదానం చేయడం మరియు దానిమ్మ చెట్టును ఇంటి నుండి దూరంగా ఉంచడం వల్ల అన్ని సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

బుధవారం, ఆవుకు పేసర్లను తినిపించండి, దీనిని ఒక రోజు ముందు నానబెట్టి తినిపించాలి. ఇది మీ అదృష్టాన్ని బలపరుస్తుంది.


కుంభరాశి
ధని 3,4 పా, శత 1,2,3,4 పా పూ.భాధ్ర 1,2,3 పా 

ఆదాయం :-14, వ్యయం :- 4, రాజపూజ్యం :- 6, అవమానం :- 1

2021 రాశి ఫలాలు ప్రకారము, కుంభరాశి వారికి అనేక బహుమతులను అందిస్తుంది. మీయొక్క కార్యాలయాల్లో మంచి ఫలితములు అందుకుంటారు. సంవత్సర ప్రారంభములో అదృష్టము మీకు కలిసివస్తుంది. వృత్తి పరంగా, మీరు అనేక ఎత్తుపల్లాలను చూస్తారు. ప్రారంభములో అదృష్టము కలిసివస్తుంది.కానీ, తరువాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోతాయి. కొంతమంది ఉద్యోగస్తులకు స్థానచలన అవకాశములు ఉన్నవి. కానీ, డిసెంబర్ మాత్రము మీయొక్క వృత్తులలో అద్భుతమైన విజయాలను అందుకుంటారు. ఆర్ధిక పరముగా మీరు ఒత్తిడికర పరిస్ధితులు ఎదురుకుంటారు.కావున, ప్రారంభములో మీరు కొంత ధనమును పొదుపుచేయుట చెప్పదగిన సూచన. మీయొక్క ఖర్చులపై నియంత్రణ అవసరము. జర్నలిజం, మీడియా మరియుసాంకేతిక రంగాలలో ఉన్న విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.

2021 రాశి ఫలాలు ప్రకారము, మీయొక్క పనిఒత్తిడి వలన మీరు కుటుంబానికి దూరముగా ఉండవలసి ఉంటుంది. ఇదే సమయములో, ఈసంవత్సరము వైవాహిక జీవితమువారికి సాధారణముగా ఉంటుంది. మీకు మరియు మీజీవితభాగస్వామి మధ్య ప్రేమ జులై నుండి ఆగష్టు నెలలో మరింత దృఢపడుతుంది. సెప్టెంబర్ పిల్లలు మరియు జీవితభాగస్వామితో కలిసి దూర ప్రయాణములు చేస్తారు. ఆరోగ్యపరముగా అంతంత మాత్రముగానే ఉంటుంది. కీళ్ల నొప్పులు, గ్యాస్, అజీర్తి, దగ్గు, జలుబు మరియుశారీరకంగా అసౌకర్యముగా ఉంటారు. కావున మీఆరోగ్యముపై తగిన జాగ్రత్త తీసుకొనుట చెప్పదగిన సూచన. మంచి ఆహారమును మరియు నీటిని తీసుకొనుట మంచిది.

కుంభరాశి ఫలాలు 2021: పరిహారము
మీ అదృష్ట కారకాన్ని బలోపేతం చేయడానికి, శుక్రవారం ఉంగరపు వేలుపై వెండి ఉంగరంలో రూపొందించిన డైమండ్ లేదా ఒపాల్ రత్నాన్ని ధరించడం మంచిది.

ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి, మీరు శనివారం మీ కుడి చేయి లేదా మెడపై బిచు జాడి లేదా ధాతురా రూట్ ధరించాలి.

మీరు నాలుగు ముఖి మరియు ఏడు ముఖి రుద్రాక్షలను కూడా ధరించవచ్చు.

శనివారం, చీమల మీద పిండిని అందించడం మరియు వికలాంగులకు ఆహారం ఇవ్వడం మంచిది.

క్రమం తప్పకుండా ఆవును పూజించండి, మహిళలను గౌరవించండి మరియు మహాలక్ష్మి దేవిని ఆరాధించండి.


మీనరాశి
పూ. భాద్ర 4వ పా, ఉ. భాద్ర 1,2,3,4 పా, రేవ 1,2,3,4 పా

ఆదాయం :-11, వ్యయం :- 5, రాజపూజ్యం :- 2, అవమానం :- 4

2021 రాశి ఫలాలు ప్రకారము, మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఒకవైపు జీవితములో వివిధ సందర్భాలలో మీరు అద్భుతమైన విజయాలను అందుకుంటారు. కొన్ని ఇబ్బందులను కూడా ఎదురుకొనవలసి ఉంటుంది.కావున మీరు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ, మీరు మీయొక్క ఉన్నతాధికారులతో మంచి సంబంధములు కలిగిఉండాలి. చదువు పరముగా మరియు ఆర్ధికపరముగా మీరుఅనేక ఎత్తుపల్లాలను ఎదురుకొనవలసి ఉంటుంది. కానీ, కుటుంబజీవితము మాత్రము ప్రశాంతముగా మరియు అనుకూలముగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు మరియు అమ్మకాలలో మీరు మంచి లాభాలను పొందగలరు.మీరు లేదా మీకుటుంబము మీయొక్క ఇంటిని అద్దెకు ఇవ్వటంద్వారా రాబడి పొందగలరు. పిల్లలకు చదువుల్లోమరియు వారియొక్క పనుల్లో అద్భుతమైన విజయాలను అందుకుంటారు. 2021లో ఆరోగ్య విషయానికి వస్తే, అనుకూలముగా ఉంటుంది. కానీ, ఆహారపు అలవాట్లపై జాగ్రత్త వహించండి.

మీనరాశి ఫలాలు 2021: పరిహారము
మంచి ఆరోగ్యం మరియు జీవితంలో పురోగతి కోసం మీరు గురువారం ఉదయం 12:30 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య చూపుడు వేలుపై బంగారు ఉంగరంలో చెక్కబడిన ఉన్నత-నాణ్యత పుష్యరాగ రత్నాన్ని ధరించాలి.

ఇది కాకుండా, సోమవారం మరియు మంగళవారం వరుసగా రెండు ముఖాలు మరియు మూడు ముఖాలు రుద్రాక్ష ధరించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

మీరు ఎల్లప్పుడూ మీ జేబులో పసుపు రంగు రుమాలు ఉంచాలి.

ముఖ్యంగా భజరంగబలిని ఆరాధించడం మీకు చాలా ఫలవంతమైనదని రుజువు చేస్తుంది.

ఆవ నూనెతో శనివారం ఒక మట్టి లేదా ఇనుప పాత్రను నింపండి మరియు మీ ప్రతిబింబం చూసిన తర్వాత దానం చేయండి. ఈ చర్యను చాయా దాన్ అని కూడా పిలుస్తారు మరియు ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుందని అంటారు.
Famous Posts:


వార్షిక రాశి ఫలాలు 2021, Rasi Phalalu 2021, 2021 to 2022 panchangam in Telugu, 2021 rasi phalalu in Telugu, 2021 to 2022 Telugu panchangam pdf, Telugu gantala panchangam, 2021 Telugu Calendar 


Comments