Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కొత్తగా పెళ్లి చేసుకునే నిరుపేద జంటలకు శుభవార్త - Good News to Tirumala Devotees - Tirumala Tirupati Devasthanam| Kalyana Mastu

  

వేల మంది నిరుపేద జంటలను ఏకం చేస్తూ.. అందరినీ ఒకే వేదికపై కూర్చోబట్టి వివాహం చేసే కల్యాణమస్తు లాంటి కార్యక్రమాన్ని త్వర‌లోనే తిరిగి ప్రారంభించనుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. అందుకు అవసరమైన నూతన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిగమ్నమైంది.

 

కలియుగ వైకుంఠంలో కొలువై ఉన్నశ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వెంకన్నస్వామి, పద్మావతీ ఆశీర్వాదంతో ప్రత్యేక వివాహాలు చేసుకోవాలని అనుకున్న పేద జంటలకు వివాహ కార్యక్రమాలు జరిపించేందుకు రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో ఈ కల్యాణమస్తు నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ముహూర్తాలని ఖరారు చేసింది. శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయి ముహుర్తాలను నిర్ణయించారు. దీనికి సంబంధించి లగ్నపత్రిక కూడా రాశారు. శ్రీవారి ఆలయ పండితులు భేటీ అయి కల్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాలను నిర్ధారించారు.

పదులు వందలు కాదు.. వేల మంది నిరుపేద జంటలను ఏకం చేస్తూ.. అందరినీ ఒకే వేదికపై కూర్చోబట్టి వివాహం చేసే కల్యాణమస్తు లాంటి కార్యక్రమాన్ని త్వర‌లోనే తిరిగి ప్రారంభించనుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. అందుకు అవసరమైన నూతన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిగమ్నమైంది. ఇప్పటికే ముహూర్తాలు పెట్టిన టీటీడీ వేదిక‌ల‌ను నిర్ణయించి త్వర‌లోనే క‌ళ్యాణ‌మ‌స్తు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించ‌నుంది.

హిందు ధర్మానికి భారీగా ప్రచారం కల్పించడంలో భాగంగా మన సంస్కతి సంప్రదాయాలు ఉట్టి పడేవిధంగా గ‌తంలో టీటీడీ నిర్వహించిన ఈ సామూహిక వివాహ‌ కార్యక్రమమైన క‌ళ్యాణ‌మ‌స్తుకు అద్భుత స్పందన వచ్చింది. గ‌తంలో 44 వేలకు పైగా జంటలను ఒక్కటి చేసినా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని కొన్ని కార‌ణాల వ‌ల్ల నిలిపివేసింది. మళ్లీ ఇఫ్పుడు మనసుమార్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో తిరిగి ఈ కార్యక్రమాని ప్రారంభించాల‌ని నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఏటా హిందు ధర్మప్రచారానికి టీటీడీ రెండు వందల కోట్ల రూపాయల పైగానే వెచ్చిస్తుంది. హిందు ధ‌ర్మప్రచారంలో భాగంగా టీటీడీ కళ్యాణమస్తు, శ్రీనివాస కళ్యాణం, గోవింద కళ్యాణాలు, మనగుడి, శుభప్రదం, సదాచారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. వీటి ద్వారా మన సంస్కతి, సంప్రదాయాలకు విస్తృత‌ ప్రచారం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ పని చేస్తోంది. వీటితో పాటు ప్రాచీన ఆలయాలను పరిరక్షించడం కాలనీలో ఆలయ నిర్మాణాలకు ఆర్థిక‌సాయం చేయడం వంటి కార్యక్రమాలను టీటీడీ పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ ద్వారా హిందు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలు వారికి అందించడమే కాకుండా హిందువులు ఇతర మతాలు వైపు మళ్లకుండా అడ్డుకోవచ్చన్నది టీటీడీ ప్రయత్నిస్తోంది.

ఈ కళ్యాణమస్తు కార్యక్రమానికి ఇప్పటికే ముహూర్తాలు కూడా ఖరారు చేశారు. ఈ సంవత్సరం మే 28 మధ్యాహ్నం 12.34 నుండి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుండి 11:08 వరకు, నవంబర్ 17 ఉదయం 9:56 నుండి 10.02 వరకు ముహూర్తాలు పెట్టి లగ్న పత్రికను తయారు చేశారు. దీంతో పది సంవత్సరాల అనంతరం టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. గతంలో 2007 నుండి 2011 సంవత్సరం వరకు 6 విడతలుగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి మాట్లాడుతూ త్వ‌ర‌లోనే కళ్యాణమస్తు వేదికలను నిర్ణయిస్తామని, కళ్యాణమస్తు లో వివాహం చేసుకున్న వారికి మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

Famous Posts:


Tirumala, TTD, TTD Online, Tirumala News Latest, Tirumala Tickets, Kalyanamastu, TTD Kalyanamastu, తిరుమల, కల్యాణమస్తు.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు