Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నిత్య పూజ తప్పులు లేకుండా సులభంగా చేసే విధానం | Daily Puja step by step Demo | Nanduri Srinivas

తప్పులు లేకుండా నిత్య పూజ (డైలీ పూజ) ఎలా చేయాలో, మరియు గ్రంథాల ప్రకారం సరైన మార్గం ఏమిటనే దానిపై మనకు తరచుగా సందేహం వస్తుంది.

ఈ వీడియోలో అద్భుతమైన మరియు సరళమైన నిత్యా పూజ ప్రక్రియ డెమో చేయబడింది, దశలతో దశలతో పాటు అర్థాలతో. ఇది Dos & DONT లను కూడా వివరిస్తుంది.

దీన్ని చూడండి, మీరు క్రింద ఉన్న వీడియో & పిడిఎఫ్ సహాయంతో మీ ఇంటిలో ఏదైనా పూజను మీ స్వంతంగా చేయవచ్చు..

Shodasopachara puja Telugu PDF (నిత్య పూజ PDF రూపంలో)

Q) ఈ పూజ  - మాంసాహారం తినేవాళ్ళు , ఆడవాళ్ళూ, పిల్లలూ, ఉపనయనం కానివాళ్ళూ , అన్ని కులాల వాళ్ళూ , పూర్వ సువాసినులు ఎవ్వరైనా చేయవచ్చా? 

A) ఎవ్వరైనా చేయవచ్చు (శుచిగా ఉన్న రోజుల్లోనే చేయాలి)


Q) పంచోపచార పూజ అంటే ఏమిటి?

A) వీడియోలో ఇచ్చిన 15 నిముషాల పూజ చేయలేని వారు, అందులోంచి క్రింద ఇచ్చిన 5 ఉపచారాలు తీసుకొని  చేసే పూజని పంచోపచార పూజ అంటారు 

Method 1: 1) ధూపం 2) దీపం 3) నైవేద్యం 4) నీరాజనం 5) నమస్కారం 

Method 2: 1) ఆవాహనం 2) స్నానం 3) ధూపం/దీపం  4) నైవేద్యం 5) నీరాజనం 


Q) షోడశోపచారాలు చేసేటప్పుడు 

(1) దేవతా మూర్తులపై జలం పోయడం 

(2) జలం చూపించి పళ్లెంలో పోయడం 

(3) అక్షతలు వేయడం

ఈ మూడిటిలో ఏది సరైన పధ్ధతి? 

A) Video లో 11.03 min దగ్గర మళ్ళీ వినండి. మూడూ సరైనవే,ఏదైనా పాటించండి 


Q) నిత్య పూజలో గణపతి పూజ, కలశ ప్రతిష్ఠాపనా అవసరం లేదా?

A) 

- గణపతి ప్రార్ధనతోనే పూజ మొదలయ్యింది. అది చాలు

- అర్చనా మాధ్యమం (Medium) గా  6 సాధనాలలో ఏదైనా  వాడవచ్చు. అందులో కలశం ఒక సాధనం మాత్రమే  . అది లేకుండా మిగితా 5 మార్గాల్లో ఏదో ఒకదానితో చేయవచ్చు. ఈ నిత్య పూజలో కలశ ప్రతిష్ఠాపనా అవసరం లేదు. ఏవైనా వ్రతాలో దీక్షలో చేసేటప్పుడు పెట్టుకోండి 


Q) గాయత్రి మంత్రం చేసుకోలేని వాళ్ళు ప్రాణాయామంలో చదవాల్సిన శ్లోకం 

A) అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం

ప్రాణాయామ విధిప్రోక్తం ఋషిభిః పరికల్పితం 

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

నిత్య పూజ ఎలా చేయాలి, Pooja Vidhanam At Home, నిత్య పూజ విధానము, Nitya Pooja Vidhanam, Nitya Pooja Vidhanam PDF Book Telugu, Nitya Pooja, daily pooja vidhanam

Comments