స్త్రీ మరియు పురుష యొక్క పవిత్ర చిహ్నాలు | Yoni & Lingam || Sacred Symbols of the Feminine and Masculine
మూర్ఖత్వానికి, అజ్ఞానికి అనేక రూపాలు..... కానీ జ్ఞానికి ఉన్నది ఒకే రూపం ఎటువంటి విషయాన్నైనా స్వచ్చమైన మనస్సుతో తెలుసుకోవడం లేదా విశ్లేషిస్తూ బుద్దిపూర్వకంగా నేర్చుకోవడం..
దేనికి ఇలా చెబుతున్నానంటే.... సనాతన ధర్మంలో ఉండే వేదములు, శాస్త్రములు, విద్యలు చాలా నిఘూడమైన విషయాలు అంటే మన ఊహకి కూడా అందనివి తెలియజేస్తాయి. అజ్ఞానంతో ఉంటే విమర్శలకు దారి తీస్తుంది. ప్రతీ విషయంలో అనుమానాలు లేదా చెడుని చూస్తుంది ఆ సామాన్య బుద్ది.. అటువంటి సామాన్య బుద్దిని మనం తొలగించుకుని ఉత్తమమైన మనస్తత్వాన్ని, స్వచ్చమైనా మనస్సుతో ఎటువంటి విషయాన్నైనా జ్ఞాన దృష్టితో చూడడం నేర్చుకోవాలి.
సృష్టిలో ఒక అద్భుతం ఉందంటే అది మానవ శరీరం..... శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఒప్పుకుంటారు... ఇప్పటికీ ఎప్పటికీ అందులో ఉండే రహస్యాలని చేదిస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ సనాతన ధర్మం యందు ఇమిడి ఉన్న జ్ఞానం, యుగములు క్రిందిటి నుంచే తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే సనాతన ఋషులు ఎంతో జ్ఞాన సారాన్ని లోకానికి అందించారు.
యుగాలు గడిచే కొద్ది... మనవ మేధస్సు తన యోక్క స్పృహను కోల్పోతూ వచ్చింది. అందువలన ఎంతో జ్ఞానం కాలంలో కలిసిపోతూ వస్తున్నా సరే ప్రతీ కాలంలో గురువులు శరీరాన్ని స్వీకరిస్తూ ఎంతో కొంత జ్ఞానాన్ని కాలానికి ఇస్తూ జనులను ఉద్దరించే విదంగా వారి జీవితాలను త్యాగం చేస్తూ మహాపురుషులు అయ్యారు.
కనుక శరీరం గురించి మనం తెలుసుకోవాలి.... స్త్రీ , పురుష బేధం అనేది లేదు. రెండూ ఒకటే. వారి ధర్మం ప్రకారం ఒకే శరీరం రెండు భాగాలుగా అయ్యింది. అందుకే అర్దనాదీశ్వరుడి స్త్రీపురుష కలయికతో ఒక్కటిగా ఉంటుంది.
మానవ బుద్ది ఎలా తయారయ్యిందంటే, ప్రతీ విషయన్ని "ఛీ" అనే కోణంలో చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి తరతరాలు అందరు ఛీ కొడుతూ, వ్యతిరేక భావన అనేది కుప్పలా పేరుకుపోయి అసలు మనిషి శరీరం యొక్క విశిష్టత అనేది ఏ కోణంలోనూ తెలియకుండా పోయింది.
జనులు వారి శరీరం గురించి వారు పట్టించుకోరు. ఏదో చెడులా చూస్తారు. అదే శరీరాన్ని వైధ్యులు తెలుసుకుని జ్ఞానం పొందుతారు..... ఇదేం వింత!!! సామాన్యులు దేనిని చెడుగా చూస్తారో, మరోవైపు అదే విలువైన జ్ఞానంగా మారుతుంది.
పురాతణ ఆలయాలపై శృంగార భంగిమలు ఉంటాయి.. అందులో చాలా రహస్యాలు ఇమిడి ఉంటాయి. పైకి విమర్శలను ఎదుర్కుంటున్నా కూడా శాస్త్రవేత్తలు పరిశోదనలు చేస్తూ ఉంటారు వాటిపై.
యోని & లింగం || స్త్రీ మరియు పురుష యొక్క పవిత్ర చిహ్నాలు
"యోని".. సంస్కృతం ఎంతో పవిత్రంగా "భగరంద్రము" అని పిలుస్తుంది. యోని అనే పదానికి “మూలం” లేదా “గర్భం” అని అర్ధం. తంత్ర యోగం ప్రకారం, యోని అనేది మనుగడకు, విశ్వానికి మూలం. ఇది ప్రకృతి తో ముడిపడి ఉంది. సనాతన ధ్యర్మం, యోని అనేది శక్తి యొక్క చిహ్నం.
యోని యొక్క ఆరాధన ఎడమ చేతి తాంత్రిక సాధన లో భాగం. ఉదాహరణకు, "కౌలా వచనం" యోని తంత్రం, యోని యొక్క వివిధ భాగాలను దశ మహా విద్యా (పది గొప్ప జ్ఞానాలు) తో అనుబంధిస్తుంది. స్త్రీలింగ చిహ్నంగా యోని స్ఫూర్తి పొందిన ఆరాధన తాంత్రిక అభ్యాసకులకు మహిళలపై తీవ్ర భక్తిని కలిగిస్తుంది.
యోని తంత్ర ఈవిదంగా చెబుతుంది, ‘‘మహిళలు అంటే దైవత్వం, మహిళలు అంటే జీవితం, మహిళలు అంటేనే నిజమైన ఆభరణాలు.’’
(యోని & లింగం - సృష్టి మరియు పునరుత్పత్తి)
యోని యొక్క పురుష ప్రతిరూపం "లింగం" లింగం మరియు యోని తరచుగా కలిసి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది సృష్టి మరియు పునరుత్పత్తి యొక్క శాశ్వత ప్రక్రియతో పాటు పురుష మరియు స్త్రీలింగ అంటే "శివ మరియు శక్తి" (ఈశ్వరుడు, పార్వతి) , స్మారక స్థితి లేదా తెలివి మరియు అనైతికత మరియు అధిగమనం యొక్క ఎడతెగని సంబంధాన్ని సూచిస్తుంది.
తంత్ర యోగ మరియు హఠ యోగాలలో, యోని స్థానాన్ని ములాధార చక్రం యొక్క బీజకోశాన్ని, ఫలదీకరణ చెందిన అండం పైపొర) సూచిస్తుంది, దీనిలో కుండలిని శక్తి గాఢనిద్రలో ఉంటుంది, లోపలికి ఎదురుగా ఉన్న కాంతి లింగం చుట్టూ పెనవేసుకొనుంటుంది.
Famous Posts:
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
Yoni & Lingam, Yoni—Sacred Source, sacred yoni, sacred linga, Creation and Regeneration, yoni hinduism, the three lingas, gudi mallam temple, yoni pooja, kamakya devi temple
Comments
Post a Comment