Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీవారి భక్తులకు శుభవార్త సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల - The good news for Srivari devotees is the release of Sarvadarshanam tokens online on September 25

సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల

దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల

ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.

Sarvadarshanam, TTD, Sarva Darshan Tirupati Tickets, free darshan available at tirupati now 2021, tirumala sarva darshan token timings, ttd 300 rs darshan online booking availability, tirupati free darshan aadhar card, ttd news, sarva darshan meaning in telugu, tirumala tirupati devasthanam

Comments

Post a Comment