Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల భక్తులకు గమనిక: వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందే - TTD makes COVID vaccine certificate, negative RT-PCR test

తిరుమల భక్తులకు గమనిక: వెంకన్న సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందేనట...

మీరు తరచుగా తిరుపతి, తిరుమలకు వెళ్తుంటారా? వెంకన్న సన్నిధికి చేరుకుని స్వామిని దర్శించుకుంటూ ఉంటారా? ఇప్పటిదాకా తిరుమల వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉంటే సరిపోయేది. అయితే ఇది వరికటిలా మామూలుగా ప్రత్యేక దర్శనం టికెట్ ను ఆన్ లైనులో బుక్ చేసుకుని వెళ్లడానికి కుదరదు. సర్వ దర్శనం చేసుకునే భక్తులు కూడా ఈ రూల్స్ పాటించాలి .

ఇప్పటినుండి తిరుమలలోకి ప్రవేశించాలంటే.. కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నట్టు సర్టిఫికెట్లు చూపించాలి. అవి కూడా మీ వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే మీరు మూడు రోజుల కరోనా నెగిటివ్ రిపోర్టును తప్పనిసరిగా చూపించాల్సిందే. లేదంటే మీకు స్వామి దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) స్పష్టం చేసింది. కరోనా వైరస్ విస్తరించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

ttd darshan rules covid-19, tirumala latest news today, ttd darshan availability chart 2021, when will tirumala open for darshan tickets for september 2021, ttd helpline number, ttd news darshan timings today, is covid test mandatory for tirupati 2021, tirumala darshan rules after lockdown

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు