Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అక్టోబరు 20న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం | Annabhishekam at Sri Kapileswara Swamy Temple on October 20th

 

kapileswara swamy temple tirupathi

తిరుపతి, 2021, అక్టోబరు 17: 

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 20వ తేదీ అన్నాభిషేకం జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఈ సందర్భంగా ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా ఉద‌యం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులను అన్నలింగ దర్శనంకు అనుమ‌తిస్తారు.

తిరుమలకు సంబంధించిన సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Tirumala news , Tirumala kapila teerdham , tirumala latest information, tirumala updates. hindu temples guide tirumala news. 

Comments