Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ 18/19 ? Karthika Pournami 2022 Date and Time

పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి

ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం  2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం. దీనిని మిగులు. తగులు. అని అంటారు.

పెద్దగా కంగారు పడవలసిన పని లేదు.  సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది.

అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి.

అదేవిధంగా పౌర్ణమి కూడా. రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే.

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి.

మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను.

ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా. లక్ష్మివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది..

ఆ విధంగా పౌర్ణమి తిధితో, కృత్తిక నక్షత్రం, శుక్రవారం  తెల్లవారుజామున 4.29 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది.

కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీన లక్ష్మీవారం రాత్రి  మాత్రమే జరుపుకుని తీరాలి.

మరుసటి రోజు అంటే శుక్రవారం రాత్రికి  జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం వచ్చేస్తుంది.

కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే.

ఉపవాస నియమం ఉన్న, ఉండాలనుకునే వారు మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.

ఉపవాస నియమం లేని వారు

దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4.30 గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు.

19వ తేదీ శుక్రవారం కూడాను. మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...

అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి..

18వ తేదీ లక్ష్మి వారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు.

పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు.

మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.

Karthika Pournami 2022, Kartik Purnima, karthika pournami date,  కార్తీక పౌర్ణమి

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు