కార్తీక మాసం అనేది ప్రాపంచిక వ్యవహారాలలో మరియు ఆధ్యాత్మికతలో మన జీవితాన్ని శ్రేష్ఠం చేయడానికి ఒక ప్రత్యేకమైన కాలం.
రుద్రాభిషేకం జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ ఎవరి సహాయం లేకుండా ఇంట్లో అభిషేకం చేయడం కష్టం
కార్తీక మాసంలో రుద్ర అభిషేకం ఎలా చేయాలో ఈ వీడియోలో వివరించాము. ఈ ప్రక్రియ రుద్ర నమకం/చమకం వలె శక్తివంతమైనది, అయితే ఇది కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుతుంది మరియు పురుషులు/మహిళలు/పిల్లలు/ఏ కులం/వితంతువులు మొదలైనవారు కూడా చేయవచ్చు.
Puja Lyrics as PDF documents తెలుగు, ఇంగ్లీష్ & కన్నడ PDF
Q) నెల మొత్తం చేయలేకపోతే ఎలా?
A) మీకు కుదిరినన్ని రోజులు చేసుకోండి
Q) ఊరు వెళితే?
A) శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఎవ్రరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించండి
Q) శివలింగం ఎలాంటిది అయితే మంచిది?
A) సామాన్యంగా ఇత్తడి, స్ఫటికం, రాయి, , మట్టి, వెండి లాంటి ఉత్తమ ధాతువులు మంచివి. Plaster of Paris లాంటి ధాతువులు వాడకూడదు
Q) When is Karthika masam in 2021? ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు
A) 5/Nov/2021 to 4/Dec/2021
Q) ప్రదోష వేళ కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా ఈ అభిషేకం?
A) చేసుకోవచ్చు
Q) కార్తీక మాసం అయ్యాకా ఆ శివలింగం ఏం చేయాలి?
A) మీరు ప్రేమతో పూజ చేసిన లింగం కదా, పూజా మందిరంలో ఉంచుకోండి. ఏమీ కాదు
Q) రోజూ తల స్నానం ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు .
Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం శివ పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
Q)ఈ స్తోత్రంతో అభిషేకం చేయకుండా మామూలుగా నోటితో చదువుకోవచ్చా?
A) చదువుకోవచ్చు
Q) మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా? మట్టి శివలింగానికైనా చేసుకోవచ్చా? శివుని చిన్న ప్రతిమ ఉన్నా దానికి చేసుకోవచ్చా? శివుడూ పార్వతీ ఉన్న ప్రతిమకి చేసుకోవచ్చా?
A) చేసుకోవచ్చు
Q) అభిషేక జలం ఏం చేయాలి?
A) చాలామంది తీర్థంగా తాగేస్తారు. అలా చేసినా పర్లేదు. లేకపోతే మొక్కల్లో పోసేయండి
Famous Posts:
Comments
Post a Comment