5 నుంచి ముక్కంటి దర్శన వేళల్లో మార్పులు..
శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో ఈనెల 5వతేది నుంచి వచ్చేనెల 4వతేది వరకు మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. ఆ మేరకు.. ఉదయం 4 గంటలకు ఆలయం తెరవడం, 4.15 గంటలకు తిరుమంజనం 4.30 గంటలకు గోపూజ, 4.45 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు 1వ కాలాభిషేకం, స్వామి సర్వదర్శనం, 7 గంటలకు 2వ కాలాభి షేకం, 10 గంటలకు 3వ కాలాభిషేకం, సాయంత్రం నాలుగు గంటలకు 4వ కాలాభిషేకం (ప్రదోష కాలాభిషేకం) (శుక్ర, శని, ఆది, సోమవారం), 9 గంటలకు పవళింపు సేవ, దర్శనం ముగింపు (మంగళ, బుధ, గురువారం), 9.30 గంటలకు పవళింపు సేవ, దర్శనం ముగింపు (శుక్ర, శని, ఆది, సోమవారం) ఉంటుందని చెప్పారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయన్నారు.
srikalahasti temple darshan timings 2021, srikalahasti temple updates today, srikalahasti temple rahu ketu pooja timings, sri kalahasti temple timings tomorrow, srikalahasti temple timings after lockdown, srikalahasti temple timings covid-19, srikalahasti temple timings phone numbers, srikalahasti temple phone number, srikalahasti
Comments
Post a Comment