Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీవారి భక్తుల కోసం.. కొత్త క్యాలెండర్ విడుదల - TTD Calendars, Diary Online Booking 2022

శ్రీవారి భక్తులు అయితే టిటిడి క్యాలెండర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏటా వెంటకటేశ్వరస్వామి దేవేరుల ఫొటోలతో ఉన్న క్యాలెండర్ ను ముద్రించి టీటీడీ భక్తులకు విక్రయిస్తుంది. 2022 ఏడాదికి గాను టీటీడీ కొత్త క్యాలెండర్ ను ముద్రించింది..మీరు టీటీడీ వారి వెబ్సైటు లొకి వెళ్లి మీకు కావలసిన క్యాలెండర్ బుక్ చేసుకోవచ్చు.

క్యాలెండర్ కోసం మీరు ఈ క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

Book TTD Calendar

టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2022 వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీ, చిన్న డైరీ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పెద్ద క్యాలెండర్‌, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్‌, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌, తెలుగు పంచాంగం క్యాలెండర్లను టిటిడి ముద్రించింది. 12 పేజీల క్యాలెండర్‌ ధర రూ.130/-, పెద్ద డైరీ ధర రూ.150/-, చిన్న డైరీ రూ.120/-, గా టిటిడి నిర్ణయించింది.

తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లడ్డూ కౌంటర్ల వద్ద, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలల్లో, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.

టీటీడీ శ్రీవారి 2022 క్యాలెండర్లు, TTD 2022 Calendar, TTD Calendars, ttd calendar 2022 - online booking, ttd calendar 2022 pdf download, ttd calendar 2022 online

Comments