కాశీ విశ్వనాథుని దర్శనాలు
మూడు రోజులు బంద్
ఉత్తర ప్రదేశ్లోని కాశీ విశ్వనాథుని దర్శనాలకు మూడు రోజులపాటు బ్రేక్ పడనుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీ కరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో కరోనా నేపథ్యంలో మొదటిసారి మూసివేశారు. గర్భగుడిలో రాతి కట్టడంపై పెయింట్ తొలగించేందుకు పాలిషింగ్ పనులు చేయనున్నారు. నవంబర్ 29, 30 తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలను నిలిపిచేయనున్నారు. డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచి డిసెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తారు. ఈ సమయంలో గర్భగుడి లోపలి గోడలను శు భ్రం చేయనున్నారు. ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులను డిసెంబర్ 13లోపు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
varanasi temple timings, varanasi temple open or not, kashi vishwanath temple varanasi, varanasi temple live, kashi vishwanath temple history, varanasi temple images, varanasi temple pin code, number of temples in varanasi
Comments
Post a Comment